YVS Chowdary Wife : వైవిఎస్ చౌదరి భార్య గురించి తెలుసా.. హీరోయిన్‌గా సినిమాలు చేసి.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
వైవిఎస్ చౌదరి భార్య గీత గతంలో పలు సినిమాల్లో నటించింది.
- Saketh U
- Published On : June 10, 2024 / 04:00 PM IST
YVS Chowdary Wife Actress Geeta Camera Appearance after long Years Goes Viral
YVS Chowdary Wife : వైవిఎస్ చౌదరి అంటే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలు పడటంతో దాదాపు 9 ఏళ్ళు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. త్వరలోనే మళ్ళీ వైవిఎస్ చౌదరి దర్శకుడిగా రాబోతున్నాడు.
నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావును వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ క్రమంలో వైవిఎస్ చౌదరి భార్య కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత కనపడటంతో ఆమె వైరల్ గా మారింది. వైవిఎస్ చౌదరి భార్య గీత గతంలో పలు సినిమాల్లో నటించింది.
Also Read : నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్
నాగార్జున సూపర్ హిట్ సినిమా నిన్నే పెళ్లాడతాలో గీత నాగార్జున చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత రవితేజ సింధూరం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత నటిగా పలు సినిమాల్లో నటించిన గీత వైవిఎస్ చౌదరిని పెళ్లి చేసుకుంది. నిన్నే పెళ్లాడతా సినిమాకు వైవిఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసారు. ఆ సమయంలోనే గీతతో పరిచయం అయి ప్రేమగా మారింది. అయితే మొదట్లో క్యాస్ట్‌లు వేరవడంతో పేరెంట్స్ ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వైవిఎస్ చౌదరి – గీత.
ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయిన గీత ఇప్పుడు నిర్మాతగా మారింది. వైవిఎస్ చౌదరి రీ ఎంట్రీ ఇస్తూ జానకి రామ్ తనయుడు ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాని గీత సొంతంగా నిర్మిస్తుంది. న్యూ ట్యాలెంట్ రోర్స్@(NTR@) అనే కొత్త బ్యానర్ స్థాపించి గీత తన భర్త దర్శకుడిగా సినిమాని నిర్మిస్తుంది. గతంలో నటిగా మెప్పించిన గీత ఇప్పుడు నిర్మాతగా ఎలాంటి సినిమాలు మన ముందుకు తీసుకొస్తుందో చూడాలి.
