నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.

నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

Pawan Visits Anakapalli Nookambika Temple

Updated On : June 10, 2024 / 3:00 PM IST

Pawan Visits Anakapalli Nookambika Temple : జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్.. ఎలాంటి ఆర్భాటం లేకుండా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ముందుగానే పార్టీ నేతలు, కార్యకర్తలు తనతో రావొద్దని పవన్ సూచించారు. పవన్ వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.

కూటమి అధికారంలోకివస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. తాను చెప్పినట్లుగా నూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పవన్ మొక్కును చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ కు తిలకం దిద్ది ఆశీర్వదించారు.

Also Read : 12న సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం.. ఈ ప్రాంతాల గుండా వాహనదారులు వెళ్లొద్దు

విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో..
అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ కల్యాణ్ రోడ్డు మార్గం ద్వారా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పవన్ చేరుకున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ వెళ్లారు.