1998 హోసూరు కేసు : మంత్రిగారికి మూడేళ్ల జైలు..

తమిళనాడు : మంత్రిగారు పార్టీ మారినా శిక్షను మాత్రం తప్పించుకోలేకపోయారు. అన్నాడీఎంకే పార్టీ నేత, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి గతంతో బీజేపీలో వున్న సమయంలో నమోదైన కేసు..అంటే 20 ఏళ్ల క్రితం కేసులో ఈనాటికి కోర్టు శిక్షను జనవరి 7న తీర్పునిస్తు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో మంత్రి బాలకృష్ణారెడ్డికి స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. ఈ క్రమంలో బాలకృష్ణారెడ్డి మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
20 ఏళ్ల కిందట బాలకృష్ణారెడ్డి బీజేపీలో వున్న సమయంలో అంటే 1998లో హోసూరులో అక్రమ మద్యం సరఫరా చేయటం దాన్ని విక్రయించటం వంటి అంశాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు బస్సులు, వాహనాలపై రాళ్లు రువ్వి ఆస్తి నష్టానికి పాల్పడ్డారు. ఆనాటి కేసులో వున్న మంత్రి బాలకృష్ణారెడ్డితో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. తీర్పు రెండు దశాబ్దాల పాటు ఆలస్యం అయినా తమిళనాడు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చట్టం కింద మంత్రిగారికి శిక్ష పడటం చాలా మంచి తీర్పు అనే ప్రశంసలు వస్తున్నాయి.