Corona Cases : దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు, 54 మరణాలు

భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 54 మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా నుంచి 20,958 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Corona

corona cases : భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 54 మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా నుంచి 20,958 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,00,138కి చేరింది. వీటిలో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,312 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరో 1,43,384 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

రోజువారీ పాజిటివిటీ రేటు 5.05 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో 0.33 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉంది. ఇప్పటివరకు 203.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.