రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులకు పాకిస్తాన్ కుట్ర
- venkaiahnaidu
- Updated on- January 25, 2021 / 06:50 AM IST
300 Pak Twitter Handles రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు ఆదివారం(జనవరి-24,2021)ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో దాదాపు 300కుపైగా పాకిస్తాన్ ట్విట్టర్ ఖాతాలను గుర్తించినట్టు స్పష్టం చేశారు.
ఈ ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రపన్నారని తెలిపారు. ఈ సమయంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం పెద్ద సవాలు అయినప్పటికీ మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ర్యాలీ సాగుతుందని స్పెషల్ పోలీస్ కమిషనర్(ఇంటెలిజెన్స్)దీపేంద్ర పాఠక్ తెలిపారు.
కాగా, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు రెండు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా టిక్రీ, సింఘు, గాజీపుర్ సరిహద్దుల్లో రిపబ్లిక్ డే రోజున భారీగా ట్రాక్టర్ ర్యాలీకి తలపెట్టారు. ట్రాక్టర్ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించిన ఢిల్లీ పోలీసులు.. రైతులతో నాలుగుసార్లు చర్చలు జరిపారు. అయితే చివరికి అనుమతిచ్చారు
