Exit Poll Results 2026 Live: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. గెలుపు ఎవరిది? ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్..

Assembly Election Exit Poll Results 2026: మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో రెండు దశల్లో (ఏప్రిల్ 23, 29) ఎన్నికలు జరిగాయి. మమతా బెనర్జీ నాయకత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

  • Updated on- April 29, 2026 / 07:37 PM IST

5 State Assembly Elections Exit Poll Results 2026 LIVE Updates

Exit Poll Results 2026 Live:

అస్సాం – ఎగ్జిట్ పోల్స్

ఆత్మసాక్షి
ఎన్డీయే – 84-90
కాంగ్రెస్ – 40-44

అస్సాం – ఎగ్జిట్ పోల్స్

ఆపరేషన్ చాణక్య
ఎన్డీయే – 74-78
కాంగ్రెస్ ప్లస్ – 45-48

చాణక్య స్ట్రాటజీస్
ఎన్డీయే – 85-98
కాంగ్రెస్ ప్లస్ – 22-32

కేరళం – ఎగ్జిట్ పోల్స్

ఆత్మసాక్షి

ఎల్డీఎఫ్ – 61-66
యూడీఎఫ్ – 76-81
ఎన్డీయే – 03-04

వెస్ట్ బెంగాల్ – ఎగ్జిట్ పోల్స్

ఆపరేషన్ చాణక్య

టీఎంసీ- 119-130
బీజేపీ- 147-153
కాంగ్రెస్-

 

ఎగ్జిట్ పోల్స్ – కేరళంలో UDFదే అధికారం..!
అధికార మార్పును కోరుకున్న ఓటర్లు
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం
2016, 2021లో అధికారంలోకి వచ్చిన ఎల్ డీఎఫ్ కూటమికి ఈసారి భంగపాటు..!

వెస్ట్ బెంగాల్ – ఎగ్జిట్ పోల్స్

టుడేస్ చాణక్య

టీఎంసీ- 130-140
బీజేపీ- 150-160
కాంగ్రెస్-

వెస్ట్ బెంగాల్ – ఎగ్జిట్ పోల్స్

పోల్ డైరీ

టీఎంసీ – 99-127
బీజేపీ – 142-171
కాంగ్రెస్ – 03-05

ఎగ్జిట్ పోల్స్ 2026 – అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్..!

వెస్ట్ బెంగాల్ – ఎగ్జిట్ పోల్స్

మ్యాట్రిజ్

టీఎంసీ- 125-140
బీజేపీ – 146-161

వెస్ట్ బెంగాల్ – ఎగ్జిట్ పోల్స్

ఆత్మసాక్షి
టీఎంసీ – 170-190
ఎన్డీయే – 120-130
కాంగ్రెస్ – 01-04

పుదుచ్చేరి – ఎగ్జిట్ పోల్స్

ఆత్మసాక్షి
ఎన్డీయే – 17-19
కాంగ్రెస్ – 11-12

పీపుల్స్ పల్స్
ఎన్డీయే – 16-19
కాంగ్రెస్ – 10-12

చాణక్య
ఎన్డీయే – 15-17
కాంగ్రెస్ – 11-13

అస్సాంలో మళ్లీ బీజేపీ రాజ్యం రాబోతోందని అంచనా
పుదుచ్చేరిలో ఎన్డీయేకే చాన్స్ అంటున్న ఎగ్జిట్ పోల్స్

తమిళనాడులో డీఎంకేకే మళ్లీ పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్
కేరళలో అధికార పార్టీకి షాక్, కాంగ్రెస్ కు జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్

కేరళం – ఎగ్జిట్ పోల్స్

ఆత్మ సాక్షి
ఎల్డీఎఫ్ – 61-66
యూడీఎఫ్ – 76-81

ఆపరేషన్ చాణక్య
ఎల్డీఎఫ్ – 55-61
యూడీఎఫ్ – 72-75

అస్సాం-ఎగ్జిట్ పోల్స్

ఎన్డీటీవీ
ఎన్డీయే – 88-100
ఏఎస్ఎం – 24-36

 

తమిళనాడు-ఎగ్జిట్ పోల్స్
న్యూస్ – 18
డీఎంకే ప్లస్ – 125-145
ఏఐఏడీఎంకే ప్లస్ – 65-80
టీవీకే – 13-18

టుడేస్ చాణక్య
డీఎంకే ప్లస్ – 145-160
ఏఐఏడీఎంకే ప్లస్ – 50-65
టీవీకే – 13-18

 

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనేది పలు సంస్థలు అంచనా వేశాయి. రాష్ట్రాల వారీగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి..

పుదుచ్చేరి – ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్

ఎన్డీయే – 16-19
ఐఎన్ సీ+ : 10-12

అస్సాం – ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్

బీజేపీ – 68-72
కాంగ్రెస్ – 22-26
ఏజీపీ – 7-10
బీపీఎఫ్ – 8-9

కేరళం – ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్
ఎల్డీఎఫ్ – 55-65
యూడీఎఫ్ – 75-85

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఏ పార్టీ అధికారంలో వస్తుంది? ఓటర్ల నాడిని ప్రతిబింబించే ఎగ్జిట్ పోల్స్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల అవుతున్నాయి. పలు జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు తమ విశ్లేషణలను వెల్లడిస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు ముందే ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ ఒక ప్రాథమిక అవగాహన కల్పిస్తాయి.

మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో రెండు దశల్లో (ఏప్రిల్ 23, 29) ఎన్నికలు జరిగాయి. మమతా బెనర్జీ నాయకత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వాలని దీదీ బలంగా కోరుకుంటున్నారు.

తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో (ఏప్రిల్ 23) పోలింగ్ జరిగింది. 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధిక పోలింగ్.

కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. పదేళ్లు సీఎంగా పని చేసిన విజయన్ మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగాయి. 74 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.

అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య పోటీ నెలకొంది. సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీ తరఫున ప్రచారం చేయగా.. కాంగ్రెస్‌ ప్రచారంలో గౌరవ్ గొగొయ్ కీలక పాత్ర పోషించారు. ఇక, తమిళనాడుకు పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి, ఇండియా బ్లాక్ మధ్య పోటీ ఉంది.

వెస్ట్ బెంగాల్- ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్
టీఎంసీ- 177-187
బీజేపీ-95-110
కాంగ్రెస్-1-3

తమిళనాడు-ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్
డీఎంకే+ : 125-145
ఏఐడీఎంకే+ : 65-80
టీవీకే – 18-24