63 Steel Spoons In Man Stomach : కడుపులో 63 స్టీల్ స్పూన్లు .. కడుపా? స్టీల్ సామాన్ల కొట్టా? అని ఆశ్చర్యపోతున్న డాక్టర్లు
ఏదో స్టీల్ సామాన్ల షాపులో కబోర్డ్ లోంచి తీసినట్లుగా ఓ వ్యక్తి కడుపులోంచి వరుసపెట్టి స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ వ్యక్తి కడుపులోంచి రెండూ మూడు కాదు ఏకంగా 63 స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు.
- nagamani
- Published on- September 29, 2022 / 02:53 PM IST
63 Steel Spoons In Man Stomach
63 steel spoons In man stomach : ఏదో స్టీల్ సామాన్ల షాపులో కబోర్డ్ లోంచి తీసినట్లుగా ఓ వ్యక్తి కడుపులోంచి వరుసపెట్టి స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ వ్యక్తి కడుపులోంచి రెండూ మూడు కాదు ఏకంగా 63 స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు. అసలు అతని కడుపులోకి స్పూన్లు ఎందుకెళ్లాయి? ఎలా వెళ్లాయి? అతనే మింగాడా? లేక ఎవరైనా బలవంతంగా అతని చేత స్టీల్ స్పూన్లు మింగించారనే విషయం అతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే..
ఉత్తరప్రదేశ్ లోని మన్సూరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బోపాడా గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి మత్తు పదార్ధాలకు బానిస అయ్యాడు. అతనితో ఆ వ్యసనం మానిపించాలనికుటుంబ సభ్యులు అనుకున్నారు. షామ్లీలోని డ్రాగ్ డీఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేశారు. అక్కడ ఒక నెల రోజుల పాటు చికిత్స పొందాడు విజయం. ఈక్రమంలో డీఅడిక్షన్ సెంటర్ లో చికిత్స పొందుతుండగా ఉన్నట్టుండి విజయ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు విజయ్ ని.. ముజఫర్ నగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. విజయ్ కి పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు.
డాక్టర్లు ఆపరేషన్ ప్రారంభించారు. అలా ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు అందరూ అవాక్కయ్యారు. ఏదో స్టీల్ సామాన్ల షాపులో ఉన్నట్లుగా అతని కడుపులో పదుల కొద్దీ స్పూన్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. అలా వాటిని బయటకు తీస్తుంటే ఒక్కదాని తరువాత మరొకటి బయటపడుతునే ఉన్నాయి. అలా ఒకటీ రెండూ కాదు 10,20 కూడా కాదు ఏకంగా 63 స్టీల్ స్పూన్లు బయటకు తీశారు. విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా..ఆ స్పూన్లు విజయ్ కడుపులోకి ఎలా వచ్చాయని డాక్టర్లు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో వారు డీఅడిక్షన్ సెంటర్ లో విజయ్ కి వైద్యం చేయించామని వైద్యం తీసుకున్న సమయంలోనే అతని అనారోగ్యానికి గురి అయ్యాడని అక్కడే వైద్య సిబ్బందే విజయ్ తో బలవంతంగా స్పూన్లు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కానీ తన కడుపులోకి స్టీల్ స్పూన్లు ఎలా వెళ్లాయి అనే విషయంపై విజయ్ మాత్రం నోరు మెదపడం లేదు. డీఅడిక్షన్ సెంటర్ సిబ్బందే ఇలా చేశాడో లేక ఆకలేసి విజయ్ ఏ తినేశాడో అనేది తెలియాల్సి ఉంది. కడుపులో ఒక స్పూన్ పట్టడమే కష్టం. అలాంటిది ఏకంగా 63 స్పూన్లు ఉన్నాయంటే షాకే మరి. కడుపులో అంత స్పేస్ ఉండదు. మరి అన్ని స్పూన్లకు కడుపలో అంత స్పేస్ ఎలా దొరికిందో మరి. ఏది ఏమైనా గానీ ఇలాంటి ఘటనలు షాక్ కు గురిచేయకుండా ఉండవు కదా..
