Independence Day Celebrations Red Fort : సప్తధార శక్తి సామర్థ్యాలతో దేశం నూతన శిఖరాలకు.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రసంగంలో హైలెట్స్ ఇవే..

Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Independence Day Celebrations Red Fort

Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎర్రకోటపై 13వ సారి వరుసగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇదిలాఉంటే.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల ప్రారంభ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈరోజు మనమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో ‘వందేమాతరం’ ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోందని అన్నారు.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ ఎదుగుతోంది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యమని, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, వికసిత్ భారత్ లక్ష్యంగా మరింత వేగంగా ముందుకెళ్లాలని అన్నారు. దేశానికి యువతే అతిపెద్ద శక్తి.. వికసిత్ భారత్ లో యువకుల పాత్ర ఎంతో కీలకమని ప్రధాని పేర్కొన్నారు. 12ఏళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించామని, ఆత్మనిర్భర్ భారత్ ను ముందుకు తీసుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.

కరోనా నుంచి బయటపడగానే యుద్ధాలు ముంచేశాయి. ముందు యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం. యుద్ధాలు వస్తే కొందరు ప్రజలను భయపెట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలకు ఇబ్బందులు రానివ్వలేదు. సంక్షోభం వస్తుందని ముందే ఊహించి చర్యలు తీసుకున్నామని, దేశ అభివృద్ధిని అడ్డుకోవటం ఎవరితరం కాదని మోదీ అన్నారు. యూరియా, డీఏపీ ధరలు పెరిగినా రైతులకు సబ్సిడీ ఇస్తున్నామని, రైతుల భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్ లో స్థిరమైన ప్రభుత్వం ఉందని, భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థి దిశగా వెళ్తోందని తెలిపారు.

తయారీ రంగం, రైతాంగం, సాంకేతికత, గతి శక్తి, రక్షణ శక్తి, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్ పవర్ అనే ఏడు ధారల సాయంతో దేశాన్ని స్వయం సమృద్ధం చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సప్తధార శక్తిసామర్థ్యాలతో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తామని, భారతావనికి నూతన వేగం అందిస్తామని, సరికొత్త లక్ష్యాలను సాధించి, వాటిని అధిగమించేలా శక్తివంతం చేస్తామని అన్నారు. యువతలో ఉన్న అపార సామర్థ్యాలను దేశ నిర్మాణం కోసం పూర్తిగా వినియోగిస్తామని మోదీ పేర్కొన్నారు. గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించలేని దానిని ఈ ఏడు ధారల సాయంతో వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో సాధిస్తామని, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.