×
Ad

Delhi : గుంతలా మారిన రోడ్డు..ఇరుక్కపోయిన కారు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో..ద్వారకాలోని సెక్టార్ 18లో రోడ్డు మీదుగా ఓ కారు వెళుతోంది. అకస్మాత్తుగా గుంతలా మారడంతో అందులో కారు లోపలికి జారీ పోయింది.

  • Published On : July 19, 2021 / 08:58 PM IST

Car

Car Got Stuck After A Road Caved : భారీ వర్షాలకు రోడ్లు ఛిద్రమై పోతున్నాయి. రోడ్లు వరదలా మారిపోతున్నాయి. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియడం లేదు. దీంతో పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో వాహనాలు అందులో కూరుకపోయిన ఘటనలు గుర్తుండే ఉంటాయి. తాజాగా…ఢిల్లీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుంగిపోయిన రోడ్డులో ఓ కారు పడిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More : Amit Shah On Pegasus Scandal : ఫోన్ హ్యాకింగ్ దుమారం.. అమిత్ షా సీరియస్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో..ద్వారకాలోని సెక్టార్ 18లో రోడ్డు మీదుగా ఓ కారు వెళుతోంది. అకస్మాత్తుగా గుంతలా మారడంతో అందులో కారు లోపలికి జారీ పోయింది. కొద్ది భాగం మాత్రమే పైకి తేలింది. ఆ రోడ్డు మీదుగా వెళుతున్న వారు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు క్రేన్ సహాయంతో కారును పైకి తీశారు. అందులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఢిల్లీలోని రోడ్ల తీరుపై విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.