Corona Patient Murdered In Chennai Government Hospital
Corona patient murdered : చెన్నై ప్రభుత్వ ఆసుప్రతిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉగ్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ చంపేసింది. కేవలం డబ్బుల కోసమే కరోనా రోగిని హత్య చేసినట్లుగా తెలిసింది. సునీత అనే కరోనా బాధితురాలు చెన్నైలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోవిడ్ సెంటర్లో చేరింది.
ఆ సెంటర్ లో కాంట్రాక్ట్ ఉగ్యోగినిగా పనిచేస్తున్న రతీదేవి అనే మహిళ సునీతను హత్య చేసింది. గత నెల 23న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని పట్టుకున్నారు.సునీత దగ్గర ఉన్న డబ్బులు,సెల్ ఫోన్ కోసం సునీతను రతీదేవి హత్య చేసింది. చికిత్స పొందుతుండగా కూడా మెరుగైన ఆరోగ్యంతో భార్య సడెన్ గా చనిపోయిందని తెలిసిన సునీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రతీదేవి సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం ఆమెను హత్య చేసిందని తేలింది. మే 23న జరిగిన ఈ హత్యను పోలీసులు ఛేధించారు.