House Owner Killed Student : కోటి రూపాయల కోసం.. అద్దెకుంటున్న విద్యార్థిని హత్య చేసిన ఇంటి యజమాని
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
- bheemraj
- Published On : December 16, 2022 / 10:26 AM IST
house owner killed student
house owner killed student : ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోదీనగర్ లో నివాసముంటున్న ఉమేశ్ శర్మ అనే వ్యక్తి తన ఇల్లును పీహెచ్ డీ స్కాలర్ విద్యార్థి అంకిత్ ఖకోర్ (45)కు అద్దెకు ఇచ్చాడు.
తల్లీదండ్రులు మరణించడంతో అంకిత్ గత కొన్నేళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఉమేశ్ శర్మ, అంకిత్ మధ్య స్నేహం ఏర్పడింది. అయితే అంకిత్ తన వారసత్వ ఆస్తిని విక్రయించగా అతనికి 1 కోటి రూపాయలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ ఉమేశ్ రూ.40 లక్షలు అప్పు ఇవ్వాలని అడగ్గా అంకిత్ ఇచ్చాడు. రూ.40 లక్షలు తిరిగి చెల్లించకుండా మిగిలిన రూ.60 లక్షలను కూడా కాజేయాలనుకున్నాడు.
hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు
అందుకుగానూ అంకిత్ ను చంపాలని ఇంటి ఓనర్ ఉమేశ్ ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు పర్వేశ్ సాయంతో ఇంటి ఓనర్ ఉమేశ్ అక్టోబర్ 6వ తేదీన అంకిత్ గొంతు కోసి హత్య చేశారు. ఆపై అతడి శరీరాన్ని మూడు ముక్కులుగా కోసి కాలువలో వేర్వేరు చోట్ల విసిరేశారు. అనుమానం రాకుండా డబ్బులు డ్రా చేసేందుకు పర్వేశ్ ను ఉమేశ్ ఉత్తరాఖండ్ కు పంపించాడు.
అంకిత్ ఏటీఎం కార్డు ద్వారా రూ.20 లక్షలు డ్రా చేశాడు. స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ చేసినా అంకిత్ సమాధానం ఇవ్వకపోవడం, టెక్ట్స్ మెస్సేజ్ లలో వ్యక్తీకరణ తేడాగా ఉండటంతో అతని ఇంటికి వెళ్లారు. అక్కడ అంకిత్ కనిపించకపోవడంతో అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
