Karnataka : మహిళపై లైంగిక దాడి.. ప్రతిఘటించడంతో సజీవదహనం
కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
- kunduru Vinod
- Published On : October 5, 2021 / 07:56 PM IST
Karnataka
Karnataka : కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్పూర్ తాలూకాకు చెందిన గంగప్ప బసప్ప అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఓ వివాహిత ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. ఇదే సమయంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను సదరు మహిళపై పోసి నిప్పటించాడు దుండగుడు.
Read More : సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..
దీంతో మహిళ కేకలు వేసింది.. ఆమె కేకలు విన్న స్థానికులు ఘటన స్థలికి వచ్చి మంటలు ఆర్పీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 95 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More : మీకు 15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే!
