Aadhaar Services Down: నిలిచిపోనున్న ఆధార్ సేవలు.. యూజర్లకు అలర్ట్.. కారణం ఏంటంటే?
ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (Aadhaar Services Down) సిస్టమ్ మెయింటెనెన్స్ కారణాల వల్ల సేవల్లో అంతరాయం కలగనుందని స్పష్టం చేసింది.
- V Santhosh Kumar
- Published on- July 25, 2026 / 06:40 PM IST
Aadhaar online services down temporary disruption uidai alert
- ఆధార్ సేవలు తాత్కాలికంగా బంద్
- సిస్టమ్ మెయింటెనెన్స్ పనులే కారణం
- రాత్రి ఏడింటి వరకే అవకాశం
Aadhaar Services Down: మన రోజువారీ జీవితంలో గుర్తింపు కార్డుగా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను పొందడానికి ఆధార్ ఎంతో కీలకమైన సాధనంగా మారింది. చిరునామా మార్పులు, ఆధార్ డౌన్‌లోడ్, ఈ-కేవైసీ వంటి అనేక రకాల పనుల కోసం పౌరులు ఎక్కువగా ఆన్‌లైన్ సేవలపైనే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఆధార్ సేవల వినియోగదారుల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేసింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణాల వల్ల సేవల్లో అంతరాయం కలగనుందని స్పష్టం చేసింది.
ఆధార్ (Aadhaar Services Down)పంపిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం వ్యవస్థ నిర్వహణ పనుల కారణంగా జూలై 25వ తేదీ శనివారం రాత్రి 7:00 గంటల నుండి జూలై 26వ తేదీ ఉదయం 9:00 గంటల వరకు అన్ని రకాల ఆన్‌లైన్ ఆధార్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ వ్యవధిలో ఆధార్ అధికారిక వెబ్‌సైట్ తో పాటు, ఎం-ఆధార్ మొబైల్ యాప్ సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది. అత్యవసరమైన ఆధార్ పనులు ఉన్నవారు రాత్రి 7 గంటల లోపే పూర్తి చేసుకోవాలని లేదా మరుసటి రోజు ఉదయం వరకు నిరీక్షించాలని సూచించింది.
సాధారణ రోజుల్లో పౌరులు ఆధార్ యాప్, వెబ్‌సైట్ ద్వారా బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, అడ్రస్ అప్‌డేట్, ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ ఆర్డర్, సమీప కేంద్రాల్లో అపాయింట్‌మెంట్ బుకింగ్ వంటి అనేక డిజిటల్ సేవలను సులభంగా పొందుతుంటారు. యాప్‌లో ఒకేసారి గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ప్రొఫైళ్లను జోడించి సేవలు పొందే వెసులుబాటు కూడా ఉంది. మెయింటెనెన్స్ సమయంలో ఈ డిజిటల్ సేవలన్నీ తాత్కాలికంగా ఆగిపోనున్నందున, వినియోగదారులు ఈ సమయాన్ని గమనించి తదనుగుణంగా తమ పనులను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
