Abhinaya: నగదు, నగలు, నలుగురు భర్తలు.. వరుస పెళ్లిల్లు చేసుకుంటూ మోసం చేస్తున్న యువతి అరెస్ట్

ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్‌ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే యేడాది తర్వాత శెంథిల్‌కుమార్‌ను విడిచిపెట్టింది. ముచ్చటగా మూడోసారి కేళంబాక్కం చేరుకుని ఓ యువకుడిని ప్రేమ పేరుతో బోల్తా కొట్టించి పెళ్ళి చేసుకుంది

Lady who married four people arrested

Abhinaya: డబ్బుల కోసం కొందరు పెళ్లిల్లు చేసుకుంటారు. డబ్బుల కోసం విడాకులు కూడా తీసుకుంటారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన అభినయ అనే యువతి ఒకరు. ఈమెకున్న డబ్బు ఆశ అంతా ఇంతా కాదు, తనకు విలాసవంతమైన జీవితం కావాలని ఏకంగా నలుగురు యువకులను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లైన ప్రతీసారి ఏడాది తిరక్కముందే వారి దగ్గరి నుంచి నగలు, నగదుతో ఉండాయించింది. ఆమెను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని పెళ్లిల్లు చేసుకునేదో. కానీ, నాలుగో భర్త నుంచి వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తాంబరం పోలీసులు.. యువతిని చేధించి అరెస్ట్ చేశారు. అనంతరం విచారణలో ఈ పెళ్లిల్ల భాగోతం బయటపడింది.

LastPass Password : లాస్ట్‌పాస్ పాస్‌వర్డ్ మేనేజర్ మళ్లీ హ్యాక్.. మీ డేటా భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త..!

తాంబరం రంగనాథపురం ప్రాంతానికి చెందిన నటరాజన్ (25) అనే యువకుడు ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతడికి ముడిచ్చూరు రహదారిలోని బేకరీలో పనిచేస్తున్న అభినయ (28) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ నుంచి పెళ్లి అనుకున్నారు. అనుకున్నట్టే నటరాజన్‌ తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఆగస్టు 29న అభినయను వివాహం చేసుకున్నాడు. కానీ, యువతి మాత్రం తన తల్లిదండ్రుల వివరాలు ఇవ్వలేదు. తన కుటుంబీకులతో గొడవలు పెట్టుకుని ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. ఈ మాటలను నటరాజన్‌, అతడి కుటుంబ సభ్యులు నమ్మారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఆగమనం ఆ రోజే..!

అయితే పెళ్ళైన నెల రోజుల తర్వాత అభినయ కనిపించలేదు. చూస్తే ఇంట్లో నగలు, నగదు లేవు. డబ్బు, నగలు తీసుకుని అభినయ పారిపోయిందనే విషయం అర్థమైంది. ఆమె ఆచూకీ కోసం వెదికితే కనిపించలేదు. ఆమె ఉపయోగించే రెండు ఫోన్‌ నెంబర్లు పనిచేయలేదు. ఇక చేసేందేం లేక తాంబరం పోలీసులకు నటరాజన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సెమ్మంజేరిలో దాగిన అభినయను అరెస్టు చేశారు. ఆమెను విచారించగా అప్పటికే ముగ్గురిని పెళ్ళాడి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడైంది.

WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ బీటాలో ఆ మెసేజ్‌లపై స్పెషల్ బటన్ వస్తోంది..!

ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్‌ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే యేడాది తర్వాత శెంథిల్‌కుమార్‌ను విడిచిపెట్టింది. ముచ్చటగా మూడోసారి కేళంబాక్కం చేరుకుని ఓ యువకుడిని ప్రేమ పేరుతో బోల్తా కొట్టించి పెళ్ళి చేసుకుంది. అక్కడా అంతే.. నగలు, నగదు దోచుకుని పరారై తాంబరం వెళ్లింది. ఇక చివరగా తాంబరంలో నటరాజన్‭ను నాలుగో వివాహం చేసుకుని పోలీసులకు చిక్కింది.

Vladimir Putin: ఒక్కసారిగా మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

నటరాజన్ ఫిర్యాదు స్వీకరించి అభినయను అరెస్ట్ చేసి విచారించగా గతంలోని మూడు పెళ్లిల్లు వెలుగుచూశాయి. అభినయ వద్దున్న 32 సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అభినయ మూడు, నాలుగో పెళ్లిల్లకు రెండో భర్త సెంథికుమార్‌ సహాయం చేశాడట. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నటరాజన్‌ ఇంటి నుండి అభినయ దోచుకెళ్ళిన నగలు, నగదును రెండో భర్తకు ఇచ్చి అతడితో విలాసంగా గడిపినట్లు పోలీసులు కనుగొన్నారు. అతడి నుంచి వెళ్లినప్పుడు డబ్బు, నగలు ఏమీ దోచుకెళ్లలేదు.

Jagdeep Dhankhar: జడ్జిల నియామకంపై సీజేఐ ముందే విమర్శలు గుప్పించిన ఉప రాష్ట్రపతి