Vladimir Putin: ఒక్కసారిగా మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
గాయం కారణంగా పుతిన్ బాత్రూంకి కూడా ఒంటరిగా వెళ్లలేకపోయారట. వైద్యులు సహాయంతో బాత్రూంకు తీసుకెళ్లినట్లు జనరల్ ఎస్వీఆర్ పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ఎటువంటి ఆధారాలను ఈ చానల్ చూపించలేదు, కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే చెప్పింది. ఇకపోతే, తన భద్రతకు సంబంధించి పుతిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు

Vladimir Putin: ప్రపంచ దేశాల అధినేతల్లో బలమైన నేతగా వెలుగొందుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మెట్లపై నడుస్తూ పట్టు సడలి పడిపోయారట. మాస్కోలోని తన అధికారిక నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జనరల్ ఎస్వీఆర్ అనే రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. వాస్తవానికి ఈ ఛానల్ పుతిన్‌పై తరుచూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ విషయాన్ని క్రెమ్లిన్ బయటపెట్టడం లేదని నిరంతరం చెప్తూ ఉంటుంది. దీంతో తాజా వార్తలో ఎంత వరకు నిజం ఉందనే అనుమానం కలుగుతోంది.
జనరల్ ఎస్వీఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. తన అధికారిక నివాసం నుంచి పుతిన్ బయటికి వస్తుండగా మెట్లపై నుంచి కాలు జారిందట. రెండు నుంచి నాలుగు మెట్లపై నుంచి ఆయన జారిపోతుండగా ఆయన వ్యక్తిగత సిబ్బంది పట్టుకుని, జాగ్రత్తగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆయన వ్యక్తిగత వైద్యులు.. వెంటనే పుతిన్ అధికారిక నివాసానికి వెళ్లి చికిత్స చేశారని పేర్కొన్నారు. మెట్లపై నుంచి పడడంతో ఆయన కీళ్లు వాచినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇప్పటికే పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం.. కల్తీ మద్యం తాగి స్కూల్ ప్రిన్సిపల్‌తో సహా ముగ్గురు మృతి
గాయం కారణంగా పుతిన్ బాత్రూంకి కూడా ఒంటరిగా వెళ్లలేకపోయారట. వైద్యులు సహాయంతో బాత్రూంకు తీసుకెళ్లినట్లు జనరల్ ఎస్వీఆర్ పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ఎటువంటి ఆధారాలను ఈ చానల్ చూపించలేదు, కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే చెప్పింది. ఇకపోతే, తన భద్రతకు సంబంధించి పుతిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బూట్ల విషయంలో కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తారు. జారకుండా ఉండేందుకు ప్రత్యేక కోటింగ్ ఉండే షూస్ ధరిస్తారు. ఇంటి వద్ద కూడా వీటినే ధరిస్తారు. ఆయన నివాసంలో మెట్లు చాలా సురక్షితమైనవి. అయినప్పటికీ ఆయన కిందపడ్డట్టలు వార్తలు రావడం గమనార్హం.