శ్రీ కృష్ణుడి కలుసుకోవాలని…ఆరంతస్తులపై నుంచి దూకేసింది
- madhu
- Published On : January 25, 2021 / 08:45 AM IST
Adamant to meet Lord Krishna, Russian woman jumps to death : మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢభక్తితో ప్రాణాలు తీసుకుంటున్నారు. తీస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో..మహిళ అపార్ట్ మెంట్ లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో Vrindavanలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది విదేశీ మహిళ.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…తాత్యానా హెమోలోవ్ స్కయా (41).. స్వస్థలం రష్యాలోని రోస్తోవ్ నగరం. మహిళా టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి Vrindavan అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. దీనిని రష్యన్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఆరో ఫ్లోర్ లో ఒంటరిగా ఉంటోందని MP Singh, superintendent (SP) తెలిపారు. ఈమె శ్రీ కృష్ణుడి భక్తురాలు. ఈమె స్నేహితుల్లో ఒకరు అదే భవనంలో ఉన్నారని, శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని కోరుకుటున్నట్లు హెమోలోవ్ వెల్లడించేదని స్నేహితురాలు చెప్పిందన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని, రష్యా రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యిందన్నారు.
