Union Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. ఎల్. మురుగన్ రాజీనామాతో వేడెక్కిన రీషఫుల్.. రేసులో ఉన్న లీడర్లు వీరే!
దీపావళికి ముందే ప్రధాని మోదీ తన కేబినెట్(Union Cabinet Reshuffle)లో భారీ మార్పులు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- V Santhosh Kumar
- Published on- October 15, 2026 / 09:03 AM IST
After L. Murugan resignation Prime Minister Modi to reshuffle the Union Cabinet before Diwali
Union Cabinet Reshuffle: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దీపావళి పండుగకు ముందే తమ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టనుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ తన మంత్రి పదవితో పాటు రాజ్యసభ (Union Cabinet Reshuffle)సభ్యత్వానికి హఠాత్తుగా రాజీనామా చేయడంతో కేబినెట్ విస్తరణపై చర్చ ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కసరత్తుకు ఇప్పుడు అధిష్ఠానం ఆఖరి రూపం ఇస్తోందని, త్వరలోనే కొత్త మంత్రుల చేరిక, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పులపై స్పష్టత రానుందని సమాచారం.
మురుగన్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీలు.. దక్షిణాది వ్యూహాలు:
తమిళనాడులో బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే మురుగన్ రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ, కేంద్రంలో ఖాళీ అయిన పదవులను భర్తీ చేయడం అధిష్ఠానానికి అత్యవసరంగా మారింది. అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అదనంగా అప్పగించారు. ఈ నేపథ్యంలో అదనపు భారంతో ఉన్న శాఖలను విభజించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
రాజ్యసభ సమీకరణాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం:
బి.ఎల్. వర్మ, హర్దీప్ సింగ్ పూరి, జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ బిట్టు వంటి కీలక నేతల రాజ్యసభ పదవీకాల ముగింపు, పునరుద్ధరణ అంశాలు కూడా కేబినెట్ కూర్పును ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా పంకజ్ చౌధరి, హర్ష్ మల్హోత్రాల ఉదాహరణల తరహాలోనే ప్రభుత్వ పదవులు, పార్టీ బాధ్యతల మధ్య సమర్థవంతమైన సమన్వయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది.
