Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా తగ్గించనున్న ‘ఎయిరిండియా’
Flight Tickets: అంతర్జాతీయ ప్రయాణికులకు టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా(Air India)’ తీపి కబురు అందించింది.
- V Santhosh Kumar
- Updated on- July 3, 2026 / 11:49 AM IST
Air India Flight Tickets Price Reduced
- ఎయిరిండియా విమాన టికెట్ల తగ్గింపు
- ఇంధన సర్‌ఛార్జీలు భారీగా కోత
- విదేశీ ప్రయాణికులకు పెద్ద ఊరట
Air India: అంతర్జాతీయ ప్రయాణికులకు టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా (Flight Tickets)’ తీపి కబురు అందించింది. గతంలో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో విమాన టికెట్లపై విధించిన అదనపు ఇంధన సర్‌ఛార్జీని తాజాగా కొంతమేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు కాస్త సద్దుమణగడంతో, ముడిచమురు ధరలు మళ్లీ పూర్వపు సాధారణ స్థాయికి చేరుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Also Read: భక్తులకు గుడ్ న్యూస్.. భారీ భద్రత నడుమ మొదలైన అమర్‌నాథ్ యాత్ర
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వంటి సుదూర దేశాలకు ప్రయాణించే వారికి పెద్ద ఉపశమనం లభించనుంది. ఆయా దేశాలకు వెళ్లి, వచ్చే విమాన టికెట్ల ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గనున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసే మధ్యతరగతి, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ఎయిరిండియా తీసుకున్న ఈ చర్య ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సవరించిన ధరల ప్రకారం.. అమెరికా, ఆస్ట్రేలియా రూట్లలో విమాన టికెట్‌పై ఉన్న సర్‌ఛార్జీని 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించారు. అలాగే ఐరోపా, యూకే రూట్లలో టికెట్‌పై సర్‌ఛార్జీని 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు కుదించారు. ఈ తగ్గింపులు జులై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎయిరిండియా అంతర్గత వర్గాలు వెల్లడించాయి.
