Air India New Rules: జుట్టు ఎక్కువగా ఊడేవాళ్లు గుండు చేయించుకోవాలి.. సిబ్బందికి ఎయిర్ ఇండియా యాజమాన్యం కొత్త రూల్స్
ఎయిర్ ఇండియాలో పనిచేసే పురుష సిబ్బంది తప్పనిసరిగా హెయిర్ జెల్ వాడాలి. బట్టతల ఉన్నవారు, తల వెంట్రుకలు ఎక్కువగా ఊడేవారు పూర్తిగా గుండు చేయించుకొని విధులకు హాజరు కావాలని, ప్రతీరోజూ షేవ్ తప్పని సరిఅని మార్గదర్శకాల్లో యాజమాన్యం పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- November 24, 2022 / 10:25 PM IST
Air india
Air India New Rules: టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసుకున్న తరువాత మిగిలిన సంస్థల మాదిరి లాభాల వైపు నడిచేందుకే ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని విభాగాల్లో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్, సిబ్బంది ప్రవర్తన, వస్త్రధారణ తదితర విషయాలపై కొత్త మార్గదర్శలను విడుదల చేసింది. పురుషులకు, మహిళా సిబ్బంది వేరువేరు మార్గదర్శకాలను యాజమాన్యం విడుదల చేసింది.
Air India Flight: మస్కట్‌లో ఎయిరిండియా విమానంలో పొగలు.. ప్రయాణికులు సురక్షితం
ఎయిర్ ఇండియాలో పనిచేసే పురుష సిబ్బంది తప్పనిసరిగా హెయిర్ జెల్ వాడాలి. బట్టతల ఉన్నవారు, తల వెంట్రుకలు ఎక్కువగా ఊడేవారు పూర్తిగా గుండు చేయించుకొని విధులకు హాజరు కావాలని, ప్రతీరోజూ షేవ్ తప్పని సరిఅని మార్గదర్శకాల్లో యాజమాన్యం పేర్కొంది. అదేవిధంగా తెల్లవెంట్రుకలు ఉన్నవారు సహజసిద్ధంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలి.
Air India: ఎయిరిండియా రిటైర్డ్ ఉద్యోగులు మళ్లీ కొలువుల్లోకి..
మహిళ సిబ్బందికికూడా ప్రత్యేక మార్గదర్శకాలను సంస్థ విడుదల చేసింది. మహిళా సిబ్బంది జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్ లో ఉండే రంగులు వేసుకోవాలి. ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. డిజైన్ లేకుండా బంగారం, డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి. రింగ్స్ వెడల్పు 1సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉండకూడదు. మణికట్టు, మెడ, చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు కట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. ఎయిర్ హోస్టెస్ చేతికి డిజైన్ బ్యాంగిల్స్ ధరించకూడదు. లిప్‌స్టిక్, నెయిల్ పెయింట్ తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మార్గదర్శకాల్లో ఎయిర్ ఇండియా పేర్కొంది.
