Air India Flight: మస్కట్‌లో ఎయిరిండియా విమానంలో పొగలు.. ప్రయాణికులు సురక్షితం

మస్కట్‌ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం నుంచి పొగలు రావడంతో అత్యవసరంగా ప్రయాణికుల్ని దింపేశారు. ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.

Air India Flight: మస్కట్‌లో ఎయిరిండియా విమానంలో పొగలు.. ప్రయాణికులు సురక్షితం

Air India Flight: మస్కట్‌లో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. మస్కట్ ఎయిర్‌పోర్టులో, రన్‌వేపై ఉండగానే విమానం నుంచి పొగలు రావడంతో ప్రయాణికుల్ని అత్యవసరంగా దించేశారు. బుధవారం ఎయిరిండియాకు చెందిన ఏఐ ఎక్స్‌ప్రెస్ బీ737 విమానం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతుండగానే, ఇంజిన్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేశారు. ఈ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ విమానం మస్కట్ నుంచి కేరళలోని కోచి రావాల్సి ఉంది. పొగలు రావడంతో విమానం నుంచి దిగిన ప్రయాణికులు రన్‌వేపై నుంచి భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డైంది. ప్రయాణికులు అందర్ని ఎయిర్‌పోర్టు సిబ్బంది సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు. ప్రయాణికులంతా ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

YS Sharmila: నన్ను ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్ నేతలకు లేదు: షర్మిల

ప్రమాద ఘటనపై నిపుణులైన ఇంజనీర్లతో విచారణ నిర్వహిస్తున్నామని, ప్రయాణికుల్ని గమ్య స్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని డీజీసీఏ తెలిపింది. ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ వెల్లడించింది.