Akhilesh Yadav: సీట్లు కాదు.. విజయం ముఖ్యం.. యూపీలో పొలిటికల్ హీట్.. సీట్ల గొడవపై అఖిలేశ్ సంచలన కామెంట్స్

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) అత్యంత కీలకమైన సందేశాన్ని ఇచ్చారు.

Akhilesh Yadav sensational comments on Samajwadi Party-Congress alliance in UP elections.

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌లో రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల సమరం ముందే వేడెక్కింది. సీట్ల సర్దుబాటుపై సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అత్యంత కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎవరికి ఏ సీటు దక్కుతుందనేది ముఖ్యం కాదని, రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు సాధించడమే ప్రాథమిక లక్ష్యమని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

Amarajeevi Jaladhara Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపే ‘అమరజీవి జలధార’ పథకం ప్రారంభం.. 27.36 లక్షల ఇళ్లకు కుళాయిలు

సీట్ల గురించి కాదు.. విజయం ముఖ్యం.. అఖిలేశ్ స్పష్టత:

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేసిన అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav).. “సీట్ల గురించి కాదు.. విజయం గురించి” అని పేర్కొన్నారు. మతతత్వానికి అడ్డుకట్ట వేయడం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు దేశంలో సౌభాగ్యం, సామరస్యం పునరుద్ధరించడమే ఈ పోరాట ముఖ్యాుద్దేశమని వెల్లడించారు. కూటమి గెలుపు అనేది ఒక్క పార్టీది కాదని, అందరి సంయుక్త ప్రయత్నానికి దక్కే విజయమని వ్యాఖ్యానించారు.

అంతర్గతంగానే చర్చించాలి.. నేతలకు కఠిన ఆదేశాలు:

ఇటీవల ఎస్పీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ కాంగ్రెస్ 150 సీట్ల డిమాండ్‌ను తప్పుబడుతూ 50 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం సరికాదని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అఖిలేశ్.. సీట్ల కేటాయింపులపై నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా మాట్లాడకుండా పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చించాలని సూచించారు. ప్రస్తుతం 403 స్థానాల అసెంబ్లీలో ఎస్పీకి 101, కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలుండగా, సీట్ల ఫార్ములా ఎలా ఖరారవుతుందనేది ఆసక్తికరంగా మారింది.