husband fell on wife feet : ప్లీజ్ నాతోనే ఉండు..నడి రోడ్డుపై భార్య కాళ్లపై పడిన భర్త..
- nagamani
- Published On : March 16, 2021 / 02:52 PM IST
Aligarh Husband Fell On Wife Feet
Aligarh husband kept pleading feet his wife boyfriend : వివాహేతర సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వ్యవస్థలో వస్తున్న ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భార్యకు భర్తలేదు. భర్తకు భార్యా లేదు. పరాయి వ్యక్తుల మీద పెరుగుతున్న వ్యామోహాలు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాలు హత్యలకు కూడా దారి తీస్తుంటం ఆందోళన కలిగించే మరో అంశం. ఈక్రమంలో యూపీలోని అలీగఢ్‌లో ఓ భర్త తన భార్య కాళ్లమీద పడిన ఘటన స్థానికంగా సంచలన కలిగించింది. ‘నన్ను వదిలి వెళ్లకు ప్లీజ్..నాతోనే ఉండు కనీసం మన పిల్లల కోసమైనా నాతో కలిసి ఉండు’’అని వేడుకుంటూ తనను వదిలి వెళ్లిపోతున్న భార్యను పట్టుకుని నడిరోడ్డుమీద ఆమె కాళ్లమీద పడి మరీ వేడుకున్నాడు. అయినా ఆ భార్య మనస్సు కరగలేదు. భర్త మాట వినలేదు. భర్తను వదిలి వెళ్లటం ఆగలేదు. మరో వ్యక్తితో వెళ్లిపోయింది…!!
వివరాల్లోకి వెళితే టప్పల్..ప్రాంతానికి చెందిని ఒక యువకుని అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహమయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యా గతకొంతకాలంగా గొడవలు చోటుచేసుకున్నాయి. మనస్పర్ధలతో తరచూ గొడవ పడేవారు. అలా వారి వివాదం కాస్తా విడాకులు తీసుకుందాం..అనుకునేవరకూ వెళ్లింది. కోర్టు మెట్లు ఎక్కారు. వారిద్దరి విడాకుల కేసు కోర్టులో కొనసాగుతోంది.
ఈ క్రమంలో భార్యాభర్తలు కోర్టు కేసుకు హాజరయ్యారు. కేసు వాదనలు అయిపోయాక ఇద్దరూ బైటకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో సదరు భర్త సడెన్ గా భార్య కాళ్లమీద పడ్డాడు. ‘‘ప్లీజ్ నన్ను వదిలి వెళ్లొద్దు..నాతోనే కలిసి ఉండు..కనీసం మన పిల్లల కోసమైనా మనిద్దరం కలసి ఉండాలని నడిరోడ్డుమీద ఆమె కాళ్లమీద పడి వేడుకున్నాడు. తనతో కలసి ఉండాలని ప్రాధేయపడ్డాడు.అలా అరగంట పాటు భార్య కాళ్లు పట్టుకుని వదల్లేదతను.
అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్లనే చూస్తు ఉన్నారు. అయినా సరే ఆమె వినలేదు. నీతో నేను ఇక పడలేను..నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదు..అంటూ భర్త మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా..బైక్ మీద వచ్చిన మరొక యువకునితో వెళ్లిపోయింది. దీంతో సదరు భర్త నిరాశగా వెళ్లిపోయాడు. భర్త భార్య కాళ్లమీద పడిన ఈ ఘటన సంచలనంగా మారింది.
