Amazon GIF : అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. తెలంగాణలో 31వేల మంది వ్యాపారులకు బెనిఫిట్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల మూడో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఎంపిక చేసిన వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తుంది.
- kunduru Vinod
- Updated on- September 30, 2021 / 09:12 PM IST
Amazon Gif
Amazon GIF : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల మూడో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఎంపిక చేసిన వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ సేల్ కోసం ఎంపిక చేయబడిన దుకాణదారులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక దీని వల్ల తెలంగాణలో 31 వేల మందికి పైగా వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వ్యాపారులకు ప్రయోజనం లభించనున్నది.
Read More : Indigo flight: హైదరాబాద్ రావాల్సిన విమానం.. భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఎఫ్-2021)ను దేశవ్యాప్తంగా 450 నగరాల పరిధిలో 75 వేలపై చిలుకు స్థానిక దుకాణాలతోపాటు లక్షల మంది చిన్న వ్యాపారులకు అంకితం చేసింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ఎదుర్కొన్న సవాళ్ల నుంచి ఈ ఫెస్టివ్ సీజన్‌లో అమెజాన్ వ్యాపారులు తిరిగి కోలుకునేలా చేయడంపై ఫోకస్ చేశామని అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ సుమిత్ సహాయ్ అని వెల్లడించారు.
Read More : Mumbai Airport : కంగనా నువ్వేమన్నా స్పెషలా?.. నెటిజన్లు ఫైర్
ప్రస్తుత ఫెస్టివ్ సీజన్‌లో వారి వ్యాపారం వృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మాకు 31 వేల మందికి పైగా వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నారని, వారికి జీఐఎఫ్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు.
