×
Ad

Anand Mahindra : నా భార్య కోసం అలా పోజిచ్చా .. ఆగ్రాలో తన హనీమూన్‌లో ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ఎన్నో విషయాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసే ఆనంద్ మహీంద్రా ఆయన పర్సనల్ ఫోటోను పోస్ట్ చేశారు. అది తన హనీమూన్ ట్రిప్ లో దిగిన ఫోటో కావటం మరో విశేషం.

  • Published On : July 22, 2023 / 02:38 PM IST

Anand Mahindra chess Photo

Anand Mahindra chess Photo : సోషల్‌మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఓ పోస్ట్ పెట్టారంటే దారి వ్యూస్ వర్షం కురవాల్సిందే. ఎన్నో విషయాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసే ఆయన తాజాగా ఆయన పర్సనల్ ఫోటోను పోస్ట్ చేశారు. పైగా అది తన హనీమూన్ ట్రిప్ లో దిగిన ఫోటో కావటం మరో విశేషం. ఇంటర్నేషనల్ చెస్ డే (international chess day)సందర్భంగా ఆనంద్ మహీంద్రా చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. అది తన హనీమూన్‌ నాటి ఫొటో అంటు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని చెబుతూ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్‌ (Viral Photo) అవుతోంది.

ఈ ఫోటో పోస్టు చేస్తు ఆయన ‘‘గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (Global Chess League) జరిగినప్పుడు.. ‘ఎప్పుడైనా చెస్‌ ఆడారా?’ అని నన్ను చాలా మంది అడిగారు. దీంతో నేను నా పాత స్మృతులను నెమరువేసుకోవటానికి నా ఆల్బమ్‌ను వెదికగా ఈ ఫోటో దొరికింది. ఇది ఆగ్రాలో నా హనీమూన్‌లో తీసుకున్న ఫొటో. రోబోటిక్‌ చెస్‌ బోర్డుపై ఆడలేదు. నా భార్య కెమెరా కోసం కేవలం పోజిచ్చానంతే..! అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో నా చెస్‌ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా..2023 గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ను తొలిసారిగా టెక్‌ మహీంద్రా, అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ సంయుక్తంగా నిర్వహించింది. 2023 జూన్‌ 21 నుంచి జులై 2 వరకు దుబాయ్‌ వేదికగా ఈ పోటీలు జరిగిన విషయం తెలిసిందే.

కాగా అనురాధ మహీంద్రా లగ్జరీ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ వెర్వ్ వ్యవస్థాపకురాలు. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె ‘మ్యాన్స్ వరల్డ్’ మ్యాగజైన్‌కు సహ వ్యవస్థాపకురాలు కూడా. ఆనంద్ మహీంద్రా, అనురాధలది ప్రేమ వివాహం. ఆనంద్ మహీంద్రా తన అమ్మమ్మ ఉంగరాన్ని బహుమతిగా అనురాధకు ఇచ్చి చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేశారట.