RIL : కొత్త సోలార్ కంపెనీలకు డైరెక్టర్‌గా అనంత్ అంబానీ

రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు Reliance New Energy Solar, Reliance New Solar Energy డైరెక్టర్ గా అనంత్ అంబానీ నియమితులయ్యారు. గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ..జూన్ 24వ తేదీన నిర్వహించిన ఆర్ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంధన వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Anant Ambani : రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు Reliance New Energy Solar, Reliance New Solar Energy డైరెక్టర్ గా అనంత్ అంబానీ నియమితులయ్యారు. గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ..జూన్ 24వ తేదీన నిర్వహించిన ఆర్ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంధన వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు…ఫిబ్రవరిలో Reliance O2C బోర్డులో ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడిని నియమించారు. చిన్న వయస్సుల్లోనే డైరెక్టర్ గా నియమితులు కావడం విశేషం.

ఇందులో సౌదీ అరాంకో పెట్టుబడి పెట్టనున్నారు. అనంత్ అంబానీ జియో ప్లాట్ ఫామ్స్ బోర్డులో డైరక్టర్ గా కూడా పని చేస్తున్నారు. ఇషా, ఆకాష్ కూడా సభ్యులుగా ఉన్నారు. సోలార్‌ తయారీ కేంద్రాల నిర్మాణం, ఎనర్జీ స్టోరేజీ కోసం బ్యాటరీ కర్మాగారం ఏర్పాటు దిశగా వెళ్తున్నట్లు ప్రకటించారు. ఫ్యూయెల్‌ సెల్‌ ఉత్పాదక ప్లాంట్‌తోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌ను నెలకొల్పనున్నామని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ గతంలో ప్రకటించారు. నాలుగు కర్మాగారాల్లో రూ. 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

సోలార్‌ పవర్‌ వైపు రిలయన్స్‌ దృష్టి సారించింది. 2030 నాటికి పవర్ సామర్థాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. ఓ కార్బన్ ఫైబర్ ప్లాంట్ కోసం పెట్టుబడులు పెడుతామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. సంస్థ ఆదాయంలో దాదాపు 60 శాతం హైడ్రోకార్బన్‌ ఆధారిత ఇంధన కార్యకలాపాల ద్వారానే సమకూరుతోంది. ఈ క్రమంలో…2035 నాటికి కార్బన్‌ రహిత సంస్థగా ఆర్‌ఐఎల్‌ (RIL) ను నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. సోలార్‌ పవర్‌ ఉత్పత్తి పెంపూ ఇందులో భాగమే.

ట్రెండింగ్ వార్తలు