Andira Bibaha: ఇదెక్కడి విడ్డూరం.. వర్షాల కోసం ఇద్దరు యువకులు పెళ్లి.. వైరల్ అవుతున్న వింత ఆచారం
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో వర్షాల కోసం గ్రామస్థులు నిర్వహించిన ఒక వింత సాంప్రదాయం(Andira Bibaha) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- V Santhosh Kumar
- Published on- June 20, 2026 / 06:23 AM IST
Andira bibaha ritual jajpur village conducts strange wedding for rainfall
- వర్షాల కోసం వింతైన వివాహం
- ఇద్దరు యువకులకు ఘనంగా పెళ్లి
- జాజ్‌పూర్ జిల్లాలో ఆసక్తికర సాంప్రదాయక వేడుక
Andira Bibaha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో వర్షాల కోసం గ్రామస్థులు నిర్వహించిన ఒక వింత సాంప్రదాయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురవాలనే నమ్మకంతో, ఇద్దరు యువకులకు హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించిన ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కొరేయి సమితి గమామియా గ్రామంలో ‘అందిర బిబాహ(Andira Bibaha)’ పేరుతో ఈ వింత ఆచారానికి తెరలేపారు. గ్రామానికి చెందిన జతిన్ ఖటువా పెండ్లికుమారుడిగా, కొలంది నాయక్ వధువుగా ముస్తాబయ్యారు. స్థానిక సర్పంచి బిష్ణుచరణ్ రథ్ మార్గదర్శకంలో గ్రామస్థులంతా కలిసి ఈ వినూత్న వివాహ తంతును ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.
Andhra Boy German Girl Wedding: సరిహద్దులు దాటిన ప్రేమ.. జర్మనీ అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి పెళ్లి
పెళ్లికుమారుడు జతిన్‌ను డీజే సంగీతం, నృత్యాల మధ్య కారులో గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించి సిద్ధేశ్వరి మందిరానికి తీసుకువచ్చారు. అక్కడ అప్పటికే వధువు వేషధారణలో సిద్ధంగా ఉన్న కొలందితో వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిపించారు. అనంతరం గ్రామస్థులందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడంతో ఈ వింత పెళ్లి వేడుక ఘనంగా ముగిసింది.
