Girl Climbs Tower : ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కిన ప్రియురాలు

ప్రియుడిపై కోపంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కిన బాలిక ఉదంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో వెలుగుచూసింది. ఓ బాలిక టవర్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఫోన్ కాల్‌పై తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. దీంతో ప్రియుడిపై ఆగ్రహంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కింది....

Girl Climbs Tower

Girl Climbs Tower : ప్రియుడిపై కోపంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కిన బాలిక ఉదంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో వెలుగుచూసింది. ఓ బాలిక టవర్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఫోన్ కాల్‌పై తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. దీంతో ప్రియుడిపై ఆగ్రహంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కింది. (girl climbs 80-feet-high tower)

Jammu and Kashmir : పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం…ఉగ్రవాది హతం

తన ప్రియురాలు టవర్ ఎక్కడం చూసిన ప్రియుడు కూడా హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కాడు. (Girl Climbs Tower) దీంతో ఇద్దరు ప్రేయసీ ప్రియుడు విద్యుత్ టవర్ ఎక్కిన ఘటనను కొందరు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. కొంతమంది స్థానిక గ్రామస్థులు టవర్ పైన వీరిద్దరిని గమనించి వెంటనే పెండ్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై వీరిద్దరి కుటుంబాలకు కూడా సమాచారం అందించారు.

Jammu and Kashmir : పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం…ఉగ్రవాది హతం

పోలీసులు వచ్చే సమయానికి టవర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్థులు గుమిగూడారు. పోలీసు అధికారులు ఈ ప్రేమ జంటతో చాలాసేపు చర్చలు జరిపి, వారిని కిందికి దిగేలా ఒప్పించారు. గంటల తరబడి తర్వాత వారిద్దరూ విద్యుత్ టవర్ దిగి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గుంపులో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీరిద్దరూ క్షేమంగా దిగారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయనప్పటికీ, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకర ప్రవర్తనకు పాల్పడవద్దని యువ జంటకు పోలీసులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు