Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో మరో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.5 తీవ్రత

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని(Philippines Earthquake) మిందనౌ ప్రాంతాన్ని శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది.

Another massive earthquake in the Philippines and 6.5 magnitude on the Richter scale.

Philippines Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనౌ ప్రాంతాన్ని శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 29 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

IAS Transfers: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ

తీవ్రమైన భూప్రకంపనల(Philippines Earthquake) నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సునామీ ముప్పును నివారించేందుకు తక్షణమే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, కొన్ని వారాల క్రితమే ఇక్కడ సంభవించిన మరో భూకంపంలో 80 మందికి పైగా మృతి చెందడం గమనార్హం.