స్టేజి కూలి పప్పు యాదవ్ పడిపోయాడు.. !!

Bihar ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టేజి కూలి మరో లీడర్ కు పరాభవం జరిగింది. బీహార్ ఎన్నికల్లో ఒకేసారి గుంపు ఎక్కువగా రావడంతో స్టేజి కూలింది. ఈ ఘటనలో జన్ అధికార్ పార్టీ లోక్‌తంత్రిక్ లీడర్ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కిందపడిపోయాడు.

ప్రాథమిక రిపోర్టుల ఆధారంగా యాదవ్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ముజఫర్ నగర్ మైనాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఘటనలో దెబ్బతిన్నట్లు పొలిటీషియన్ కుడిచేయి విరిగి కనిపిస్తుంది. స్టేజి మీదకు సామర్థ్యానికి మించి మనుషులు రావడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.



మైక్రో ఫోన్‌లో పప్పు యాదవ్ సపోర్టర్లతో మాట్లాడుతుండగా స్టేజి కూలినట్లుగా వీడియోలో తెలుస్తుంది. యాదవ్ పార్టీ.. చంద్రశేఖర్ ఆజాద్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీతో, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) మిగతా చిన్న పార్టీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అక్టోబరు 15న ఇలాంటి ఘటనే జరిగింది. జనతాదళ యునైటెడ్ లీడర్ చంద్రికా రాయ్ ఎన్నికల్లో భాగంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో స్టేజి కూలి పడిపోయారు. సామర్థ్యానికి మించి స్టేజి మీదకు రావడంతో కిందపడిపోగా సీరియస్ గాయాలేమీ కాకపోవడం గమనార్హం.

సోన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు రాయ్ నామినేషన్ వేశారు. ఎటువంటి ప్రమాదకర గాయాలు నమోదు కాలేదు. భారతీయ జనతాపార్టీ లీడర్ రాజీవ్ ప్రతాప్ రూడీ కూడా అదే సమయానికి స్టేజిపై ఉన్నారు.

అక్టోబర్ 29న కాంగ్రెస్ అభ్యర్థి మష్కూర్ అహమ్మద్ ఉస్మానీని స్టేజిపై నుంచి తోసేయడంతో కొద్ది పాటి గాయాలతో బయటపడ్డాడు. అదే రోజు కాంగ్రెస్ మరో ప్రచార కార్యక్రమంలో పార్టీ లీడర్లు ఇమ్రాన్ ప్రతాప్‌గరీ, అఖిలేశ్ సింగ్, ఇతర పార్టీ వర్కర్లు స్టేజిపై ఉన్నారు.