Are You Buying Gold : బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోసపోయినట్లే..!

Are You Buying Gold : బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఛార్జీని పెంచడం వల్ల కొందరు వ్యాపారులు నకిలీ హాల్ మార్కింగ్ స్టాంపులను సృష్టించి వినియోగదారులను మోసంచేసే ప్రమాదం ఉందని జేజేసీ హెచ్చరిస్తోంది.

Are you buying gold_ Here is how to check for the hallmark

Are You Buying Gold : దసరా పండుగ సందడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి.. దీంతో పల్లెలు, పట్టణాల్లో ఇంటింటా పండుగ శోభ నెలకొననుంది. దీనికితోడు వచ్చేనెలలో దీపావళి పండుగ రానుంది. వరుస పండుగల నేపథ్యంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. అయితే, బంగారం కొనుగోళ్లు జరిపే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటూ మోసపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Also Read : WhatsApp New Features : వాట్సాప్‌లో 2 ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్లు.. ఇకపై ప్రైవసీ, ఫోకస్ మరింత ఈజీ..!

ఏదైనా బంగారు ఆభరణం కొనుగోలు అనంతరం, స్వచ్ఛత ధ్రువీకరణకు హాల్‌మార్కింగ్ చిహ్నాలను పరిశీలించాల్సి ఉంటుంది. హాల్‌మార్కింగ్ ఉంది కదా అని దానిని యాప్‌లో చెక్ చేసుకోకపోతే కొనుగోలుదారులు మోసపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇటీవల ఒక్కో బంగారు ఆభరణానికి హాల్‌మార్కింగ్ ధ్రువీకరణ ఇచ్చేందుకు ఛార్జీని రూ.45 నుంచి రూ.75కి భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) పెంచింది. ఈ పెంపుతో మోసాలు జరిగే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ధరల పెంపు కారణంగా కొందరు వ్యాపారులు నాణ్యతలేని బంగారాన్ని అంటగట్టే ప్రమాదాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఛార్జీని పెంచడం వల్ల, స్వచ్ఛత ధ్రువీకరణ కోసం అస్సేయింగ్ లేదంటే హాల్‌మార్కింగ్ కేంద్రానికి వెళ్లకుండా కొందరు వ్యాపారులు నకిలీ హాల్ మార్కింగ్ స్టాంపులను సృష్టించి వినియోగదారులను మోసంచేసే ప్రమాదం ఉందని ఆలిండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జేజేసీ) హెచ్చరిస్తోంది. ప్రతి ఆభరణానికి ముద్రిస్తున్న హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (హెచ్‌యూఐడీ) గురించి కొనుగోలుదారులకు అవగాహన లేకపోవడం అక్రమార్కులకు కలిసొస్తోందని పేర్కొంది.

మీ స్మార్ట్ ఫోన్‌లో ఇలా తనిఖీ చేసుకోండి..
హాల్‌మార్కింగ్ తనిఖీ చేసుకోవడానికి అనేక విధానాలు ఉన్నాయి. బీఐఎస్ నిబంధనల ప్రకారం.. అసలైన హాల్‌మార్క్ ఆభరణంపై మూడు గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. బీఐఎస్ లోగో, స్వచ్ఛత గ్రేడ్ (22, 18 క్యారెట్లు), ఆరు అంకెల అక్షరాలతో కూడిన హెచ్‌యూఐడీ కోడ్ ఉండాలి. దీని పరిశీలనకు స్మార్ట్ ఫోన్‌లోకి బీఐఎస్ కేర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, హెచ్‌యూఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. మనం కొనుగోలు చేయాలనుకుంటున్న ఆభరణంపై ఉండే హెచ్‌యూఐడీ కోడ్‌ను అందులో నమోదు చేస్తే అది సరైన ధ్రువీకరణ పొందిన ఆభరణమో, కాదో తెలుస్తుంది. సరైనది అయితే, ఆభరణంలో బంగారం స్వచ్ఛత, హాల్‌మార్క్ చేసిన తేదీ, సదరు కేంద్రం వివరాలు క్షణాల్లో తెలుస్తాయి.