Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?

Assembly By-Election Results : దేశంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో (మంజల్‌పూర్, దాతియా, బంకీపూర్) మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్ లో మినహా.. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోని ఉపపోరులో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు.

Assembly by-election results in three states _ BJP defeat in Datia and Manjalpur

Assembly By-Election Results Big Shock To BJP Party : దేశంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో (మంజల్‌పూర్, దాతియా, బంకీపూర్) మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలోకి ఉంది. అయితే, ఈ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికాగా.. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు. కేవలం గుజరాత్‌లో మాత్రమే బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఓటమికి కారణం స్థానిక కారణాలతోపాటు.. ఇటీవల జరిగిన జెన్‌జీ ఉద్యమ ప్రభావం కూడా కారణమై ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read : Prashant Kishor : ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. బీజేపీ కంచుకోట బద్దలు

బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ మూడుచోట్లా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా, రెండు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవటం బీజేపీకి పెద్ద దెబ్బగానే భావించాలి. అయితే, అది జెన్‌జీ వల్లే అయిందా? అంటే ఔనని చెప్పలేం. అలాఅని, కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే.. బీహార్‌ రాష్ట్రంలోనూ నిరసనలు చాలా గట్టిగానే జరిగాయి. స్టూడెంట్స్ నిరసనలు, జెన్‌జీ ఉద్యమంతో ప్రభావితం అయిన వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేసి ఉండొచ్చు. అయితే, జెన్ జీ ఓటర్లు ఆ రెండు నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారనేది లెక్కతీస్తేనేగానీ.. జెన్ జీ ఉద్యమం వల్లనే బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పగలం.

Also Read : Prashant Kishor : ఉప ఎన్నికల్లో విజయం తరువాత ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్.. బీజేపీ అధిష్టానంకు హెచ్చరిక.. అతన్ని మార్చండి

ఇదిలాఉంటే.. ఎన్నికలు జరిగిన జులై 30వ తేదీ నాటికి జంతర్ మంతర్ వద్ద నిరసనలకు ఫుల్ స్టాప్ పడింది. కానీ, ఆ ప్రభావం కొంతకాలం ఉంటుంది. కాబట్టి మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని రెండు నియోజక వర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయి ఉండొచ్చునని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఎక్కువ శాతం మాత్రం స్థానిక ప్రభుత్వాల ఫెయిల్యూర్ గా భావించాలని, అందుకు కొంతశాతం జన్ జీ ఉద్యమం, ఆయా రాష్ట్రాల్లో స్టూడెంట్స్ నిరసనలు కారణం అయ్యి ఉండొచ్చునని పేర్కొంటున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండికూడా ఆ రెండు చోట్ల ఉపఎన్నికల్లో ఓడిపోవటం బీజేపీకి బిగ్ షాకేనని చెప్పొచ్చు.

మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు ఇలా..
♦ గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లాలోని మంజల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సతీష్ పటేల్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భిఖాభాయ్ రబారిపై 30వేల ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 55,084 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రబారికి 24,585 ఓట్లు పోలయ్యాయి.
♦ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని దాతియా నియోజ‌క‌వ‌ర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఘ‌న్‌శ్యామ్ సింగ్ విజ‌యం సాధించారు. ఆయ‌న‌కు 66,757 ఓట్లు పోల‌య్యాయి. బీజేపీ అభ్య‌ర్థి ఆశుతోష్ తివారికి 60,741 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఘ‌న్‌శ్యామ్ సింగ్ సుమారు 6016 ఓట్ల తేడాతో విజ‌యం సాధించిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం డేటా ద్వారా తెలుస్తోంది.
♦ బీహార్ రాష్ట్రంలోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికల్లో జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించాడు. తద్వారా బీజేపీ కంచుకోటను ఆయన బద్దలు కొట్టారు. తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 18,964 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌కు అడ్డాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో దాదాపు 30ఏళ్ల తర్వాత బీజేపీ ఓటమిపాలవ్వడం గమనార్హం.