PM Modi birthday : మోదీ జన్మదినోత్సవ వేళ ఆటోవాలాల బంపర్ డిస్కోంట్ ఆఫర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పరిధిలోని సూరత్ నగరంలో ఆటోవాలాలు ప్రయాణికులకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు....
- saleem sk
- Published On : September 17, 2023 / 06:10 AM IST
PM Modi birthday
PM Modi birthday : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పరిధిలోని సూరత్ నగరంలో ఆటోవాలాలు ప్రయాణికులకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. సూరత్ నగరంలోని 1,000 మంది ఆటో డ్రైవర్లు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ప్రయాణీకులకు 30 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ చెప్పారు. (Auto drivers in Surat to offer discounts) ఆటో రిక్షా డ్రైవర్ల ఉదారమైన చర్యకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఈ ప్రకటన చేశారు.
Plane Crash : బ్రెజిల్‌లో విమానం కూలి 14 మంది మృతి
‘‘1,000 మంది ఆటో రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజున 30 శాతం తగ్గింపును ప్రకటించారు. మరో 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నారు. ఈ ఆటో-రిక్షా డ్రైవర్లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని బీజేపీ నాయకుడు పూర్ణేష్ మోదీ పేర్కొన్నారు. (PM Modi’s birthday) ప్రధానమంత్రి పుట్టినరోజున బీజేపీ సేవా పఖ్వారా అనే రెండు వారాల ప్రచారాన్ని ప్రారంభించింది.
CWC Meeting : హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం.. 14 తీర్మానాలకు ఆమోదం
ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత డ్రైవ్‌లు, ఆరోగ్య శిబిరాలు వంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి మోదీ తన పుట్టినరోజున కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠాత్మక పథకం పీఎం విశ్వకర్మను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు,హస్తకళాకారులు, సంప్రదాయ నైపుణ్యాలలో నిమగ్నమై ఉన్న ఇతరులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
