Plane Crash : బ్రెజిల్‌లో విమానం కూలి 14 మంది మృతి
బ్రెజిల్ దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 14మంది మరణించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కూలిపోవడంతో శనివారం 14 మంది మరణించారని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ చెప్పారు....

Brazil Plane Crash
Plane Crash : బ్రెజిల్ దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 14మంది మరణించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కూలిపోవడంతో శనివారం 14 మంది మరణించారని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ చెప్పారు. ( Plane Crashes In Brazil) ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు మరణించారని గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్ లో రాశారు.
CWC Meeting : హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం.. 14 తీర్మానాలకు ఆమోదం
ఈ విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని బ్రెజిల్ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని మనౌస్ నుంచి బార్సిలోస్‌కు విమానంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణీకులు స్పోర్ట్ ఫిషింగ్ కోసం ఈ ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని బ్రెజిలియన్ రాష్ట్ర భద్రతా కార్యదర్శి వినిసియస్ అల్మేడా పేర్కొన్నారు.