Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్ సవాల్‌కు మేం సిద్ధం.. అలా అయితేనే అంటూ షరతు పెట్టిన రెజ్లర్లు
బ్రిజ్ భూషణ్ సవాల్‌కు రెజ్లర్లు సై అన్నారు. సోమవారం సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బ్రిజ్ భూషణ్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
- Harishth Thanniru
- Published On : May 22, 2023 / 01:42 PM IST
Wrestlers Protest
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (MP Brijbhushan Sharan Singh), రెజర్ల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది నెలల క్రితం రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై బహిరంగంగా లైంగిక ఆరోపణలు చేశారు. అతన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia), సాక్షి మాలిక్ (Sakshi Malik) లతో పాటు పలువురు మహిళా రెజర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం విధితమే. సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై ఫోక్సో చట్టంతోపాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Brijbhushan Sharan Singh: నేను నార్కో పరీక్షకు సిద్ధం.. రెజ్లర్లు సిద్ధమా? బ్రిజ్ భూషణ్ సంచలన ప్రకటన
రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘాలుసైతం మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో ఆదివారం ఖాప్ పంచాయితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రిజ్ భూషణ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని ఖాప్ పంచాయితీ పెద్దలు తీర్మానించారు. వారి తీర్మానానికి బ్రిజ్ భూషణ్ స్పందించారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ పోస్టు చేశారు. బ్రిజ్ భూషణ్ ఫేస్‌బుక్ పోస్టు ప్రకారం.. నార్కో టెస్టుతో పాటు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే.. నాతోపాటు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియాలకుకూడా ఈ పరీక్ష నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకు వారు సిద్ధమైతే మీడియా ముందు ప్రకటించాలని, వారు నార్కో పరీక్షకు సిద్ధమైతే నేనూ సిద్ధమే అంటూ బ్రిజ్ భూషణ్ ప్రకటించారు.
బ్రిజ్ భూషణ్ సవాల్‌కు రెజ్లర్లు సై అన్నారు. సోమవారం సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బ్రిజ్ భూషణ్ పై తాము చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. నార్కో టెస్టుకు వినేష్ ఫోగట్, బజరంగ్ మాత్రమే కాదు.. బ్రిజ్ భూషణ్ పై ఫిర్యాదుదారులందరూ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నార్కో పరీక్షను సుప్రీంకోర్టు ద్వారా నిర్వహించాలి. అంతేకాదు.. ఆ పరీక్ష ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశం మొత్తం చూసేలా ఏర్పాటు చేయాలని అన్నారు. తద్వారా అతను దేశంలోని ఆడ పిల్లలతో ఏమి చేశాడో దేశం మొత్తం వింటుందని అన్నారు.
