CAA ఎఫెక్ట్ : బీజేపీ యువ ఎంపీ హత్యకు కుట్ర

భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.

  • Publish Date - January 18, 2020 / 09:14 AM IST

భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.

భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు. బెంగుళూరు దక్షిణ నియోజకవర్గ యువ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు యువ బ్రిగేడ్‌ సంస్థాపక అధ్యక్షుడు చక్రవర్తి సూలిబెలె హత్యకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారు. ఇటీవల  టౌన్ హాల్ వద్ద సీఏఏకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో  పాల్గోని ఇంటికి వెళుతున్న RSS  కార్యకర్త వరణుపై జరిగిన హత్యా యత్నం కేసులో  అరెస్టు చేసిన నిందితులను విచారించగా ఈవిషయాలు బయట పడ్డాయి.

వరుణ్‌పై హత్యాయత్నం కేసులో  ఎస్‌డీపీఐ(సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసారు. ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు యువ బ్రిగేడ్‌ నేత చక్రవర్తి సూలిబెలెలను హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు ఆరుగురు నిందితులు విచారణలో వెల్లడించారు.  

ఈ నిందితుల వివరాలను నగర పోలీసు కమిషనర్‌ భాస్కర్‌రావు విలేకరులకు తెలిపారు. ఎస్‌డీపీఐ కార్యకర్తలు మహ్మద్‌ ఇర్ఫాన్‌(33), సయ్యద్‌ అక్బర్‌(46), సయ్యద్‌ సిద్దిక్‌ అక్బర్‌(30), అక్బర్‌బాషా(27), సనావుల్లా షరీఫ్‌(28), సాదిక్‌ (39)లను కోర్టులో హాజరుపరిచి సమగ్ర విచారణ కోసం కస్టడీకి తీసుకుంటున్నట్లు కమిషనర్‌ తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో కలిసిం చర్చించేందుకు  తేజస్వీ సూర్య  కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, జేపీ నడ్డా బేటీలో తేజస్వీ సూర్యకూడా పాల్గోన్నారు. 

ట్రెండింగ్ వార్తలు