భారత్‌లో రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

ఏదో తప్పనిసరిగా యాండ్రాయిడ్ వాడాలి. మినిమం ఫీచర్లు ఉంటే చాలు పని గడిచిపోతుందనుకునే వాళ్ల కోసం రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎదురుచూస్తున్నాయి. టాప్ బ్రాండింగ్ కంపెనీలకు చెందిన ఈ మొబైల్ ఫోన్లు 4జీ కనెక్టివిటీతో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్నాయి. 

NOKIA 1:

ఈ ఫోన్ యాండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్)తో 1జీబీ ర్యామ్, మీడియా టెక్ ప్రాసెసర్ లతో పనిచేస్తుంది. తేలికపాటి ఫోన్ మాత్రమే కాకుండా  ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుంది. పైగా దీని కవర్ ను కూడా కావలసినట్లుగా మార్చుకోవచ్చు. 
స్క్రీన్ సైజ్ :     4.5″ (480 x 854)
కెమెరా : 5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా | 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
ర్యామ్ :    1 జీబీ
బ్యాటరీ :    2150 mAh
ఆపరేషన్ సిస్టమ్ : యాండ్రాయిడ్
ప్రొసెసర్ :    క్వాడ్
ధర : 4490    

 

 

XIAOMI REDMI GO 

రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో జియోమీ రెడ్ మీ గో రెండో స్థానంలో నిలిచింది. రేట్‌కు తగ్గట్లుగా కెమెరా డీసెంట్ పర్‌ఫార్మెన్స్ అందిస్తుంది. ఇంకోటి దీని ప్యానెల్ స్క్రాచ్ లు పడకుండా స్మూత్ లేయర్ తో ఉంది. 

స్క్రీన్ సైజ్ :    5″ (720 X 1280)
కెమెరా : 8 బ్యాక్| 5 ఫ్రంట్ MP
ర్యామ్ : 1జీబీ
బ్యాటరీ : 3000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : యాండ్రాయిడ్
ప్రొససర్ : క్వాడ్
ధర : 4750    

 

 

Lava Z60s  
ఇదే ఫోన్ మార్కెట్లో యాండ్రాయిడ్ ఓరియా(గో ఎడిషన్)గా అందుబాటులో ఉంది. 1జీబీ ర్యామ్, 16జీబీ హార్డ్ డిస్క్. 1.1GHzతో మీడియా టెక్ ప్రొసెసర్ లు ఫోన్ ఫీచర్స్. లావా దీనికి రెండేళ్ల వారంటీ కూడా అందిస్తుంది. 

స్క్రీన్ సైజ్ :    5″ (720 x 1080)
కెమెరా :    5 బ్యాక్ | 5 ఫ్రంట్ MP
ర్యామ్ :    1 జీబీ
బ్యాటరీ :    2500 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ :    యాండ్రాయిడ్ గో
ప్రొసెసర్ :    Quad
ధర : 4770

 

 

MICROMAX BHARAT GO

ఫీచర్ ఫోన్ వాడి తొలి సారి యాండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్లకు బెస్ట్ ఫోన్. గూగుల్ సూట్‌తో పాటు లైట్ యాప్స్‌తో పనిచేస్తుంది. దీంతో ఫోన్ మెమొరీ మాత్రమే కాకుండా డేటా వినియోగం కూడా తక్కువే అవుతుంది. స్క్రీన్ సైట్ 4.5అంగుళాలతో పాటు ముందు, వెనుక సమానంగా 5మెగా పిక్సెల్ కెమెరాతో రూపొందించారు. 

స్క్రీన్ సైజ్ :    4.5″ (480 x 854)
కెమెరా :    5 | 5 MP
ర్యామ్ :    1 GB
బ్యాటరీ :    2000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : యాండ్రాయిడ్
ప్రొసెసర్ :    క్వాడ్
ధర: 3990    

 

 

 

RELIANCE JIOPHONE
రిలయన్స్ జియో ఒరిజినల్ ఫోన్. పూర్తి స్మార్ట్ ఫోన్ కాకపోయినా రేటుకు మించిన ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. ఫేస్ బుక్, వాట్సప్ లతో పాటు జియోకు సంబంధించిన యాప్ లతో పనిచేస్తుంది. రూ.1500కు దొరుకుతున్న ఫోన్ మూడేళ్ల తర్వాత అదే అమౌంట్ క్యాష్ బ్యాక్ ద్వారా తిరిగి పొందొచ్చు. 

స్క్రీన్ సైజ్ :    2.4″ (240 x 320)
కెమెరా :    2 | 0.3 MP
ర్యామ్ :    512MB
బ్యాటరీ :    2000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ :    KAI OS
ప్రొసెసర్ :    Dual Core
ధర : 1500