Gyanesh Kumar : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌కు బిగ్ షాక్.. 20ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి..

Chief Election Commissioner Gyanesh Kumar : ఎస్ఐఆర్‌తోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు వివాదాలు కొనసాగుతున్న వేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది.

Chief Election Commissioner Gyanesh Kumar

Chief Election Commissioner Gyanesh Kumar : ఎస్ఐఆర్‌తోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు వివాదాలు కొనసాగుతున్న వేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. దాదాపు 20ఏళ్ల క్రితం ఆయన పేరు తెరపైకి వచ్చిన ఓ ఆత్మహత్య కేసును కేరళ ప్రభుత్వం మళ్లీ కదిలించింది.

Also Read : Amaravati Development : అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. మరో రైల్వేలైన్.. రూ.599కోట్లతో టెండర్లకు ఆహ్వానం..

2006 నాటి కేసులో అప్పటి ఆరోపణలు, సూసైడ్ నోట్‌లోని అంశాలపై తాజాగా విజిలెన్స్ విచారణకు కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సర్ వ్యవహారంపై ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్న జ్ఞానేశ్ కుమార్‌కు.. ఈ పాత కేసు మరింత తలనొప్పిగా మారింది. అసలు 2006లో ఏం జరిగింది? జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలేంటి? ఇప్పుడు ఈ కేసును ఎందుకు రీ-ఓపెన్ చేశారు? అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది.

2006లో కేరళ రాష్ట్రంలో రవాణా ప్రాజెక్టులో భాగంగా ఎంసీ రోడ్డు ఆధునీకరణ పనుల కాంట్రాక్ట్ ను మలేషియాకు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ పాటి, కేరళకు చెందిన బాగీరథి కన్‌స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంయుక్తంగా పాటి-బెల్ పేరుతో చేపట్టాయి. ఆ సమయంలో కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా జ్ఞానేశ్ కుమార్ ఉన్నారు. అప్పట్లో కేరళ కేఎస్‌పీటీ-1 ప్రాజెక్ట్‌కు చీఫ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మలేషియాకు చెందిన సివిల్ ఇంజనీర్ లీసీ బీన్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్యకు ముందు లీసీ బీన్ రాసిన సూసైడ్ నోట్‌లో జ్ఞానేశ్ కుమార్ పేరును ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు పనుల నిర్వహణలో తీవ్రమైన అవినీతి జరిగిందని, అదేవిధంగా తనకు తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయని.. ఈ వేధింపుల వెనుక జ్ఞానేశ్ కుమార్ పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఆ అంశాన్ని తెరపైకి తెస్తూ. విజిలెన్స్ విచారణకు కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల ఆదేశాలు ఇచ్చారు.

కేపీసీసీ నేత వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హోంమంత్రి చెన్నితల ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. 2006లో జరిగిన విజిలెన్స్ ప్రాథమిక విచారణకు సంబంధించిన ఫైళ్లను కూడా హోం శాఖ ఇప్పటికే కోరింది. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB) తొలుత ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, అందులో వెలువడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. అయితే విజిలెన్స్ విచారణకు ఆదేశించడం మాత్రమే జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు రుజువైనట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విచారణలో వెలువడే ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉండనున్నాయి.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విషయంలో జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు, ఆందోళనలు చేస్తున్న సమయంలోనే ఈ పాత కేసు మళ్లీ తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.