Snake Rakhi : పాములకు రాఖీ కట్టాడు.. ఆ తర్వాత చనిపోయాడు
సరదాకు చేసిన పని అతడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కథ అడ్డం తిరిగింది. పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్‌లోని
- Naveen
- Published On : August 23, 2021 / 10:20 PM IST
Snake Rakhi
Snake Rakhi : సరదాకు చేసిన పని అతడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టాడు. ఆ తర్వాత తన చెల్లెళ్లతోనూ వాటికి రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. అయితే కథ అడ్డం తిరిగింది. పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది.
ఆదివారం(ఆగస్టు 22,2021) రాఖీ పండగ. ఈ సందర్భంగా పాములు పట్టే 25ఏళ్ల మన్మోహన్ రెండు పాములకు రాఖీ కట్టాడు. ఆ తర్వాత తన చెల్లెళ్లతోనూ పాములకు రాఖీలు కట్టించేందుకు ప్రయత్నించాడు. దీని కోసం రెండు పాముల తోకలను పట్టుకున్నాడు. వారితో రాఖీ కట్టించే పనిలో అతడు మునిగిపోయడు. ఇంతలో ఒక పాము మెల్లగా పాకుతూ ఏమరుపాటుగా ఉన్న అతడి పాదం వేలిపై కాటు వేసింది. దీంతో మన్మోహన్ ఉలిక్కిపడి లేచాడు. అయితే ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేశాడు. ఆ కాసేపటికే అతడు మరణించాడు.
మన్మోహన్ పాములకు రాఖీ కట్టే దృశ్యాన్ని చూసేందుకు చాలామంది అక్కడికి చాలామందే వచ్చారు. కొందరు దీన్ని మొబైల్ లో వీడియో తీశారు. ఇప్పుడా వీయోడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన్మోహన్ ప్రకృతి ప్రేమికుడు. గత పదేళ్లుగా ఇళ్లలోకి ప్రవేశించే పాములను పట్టి వాటిని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టేవాడు. గాయపడిన పాములకు చికిత్స కూడా చేసేవాడు. పాము కాటుకు గురైన వందలాది స్థానికులు, పరిసర గ్రామస్తులకు చికిత్స అందించాడు. అలాంటి వ్యక్తి పాము కాటు వల్ల చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది.
बिहार के सारण में बहन से साप को राखी बंधवाना महंगा पड़ गया साप के डसने से भाई की चली गई जान pic.twitter.com/675xsgnZ6N
— Tushar Srivastava (@TusharSrilive) August 23, 2021
