Narendra Modi : ఆస్ట్రేలియా బాటలో భారత్.. సోషల్ మీడియాను బ్యాన్ చేయబోతున్నారా? ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi : పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికల దుష్ర్పభావాల గురించిన ఆందోళనలు, ప్రపంచ వ్యాప్తంగా మైనర్లపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే పిలుపులను మరింత బలపరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
Narendra Modi
Narendra Modi : ఆస్ట్రేలియా బాటలో పయనించేందుకు భారత్ సిద్ధమైందా..? 16ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా? ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేసింది. మేం కూడా ఆస్ట్రేలియాను చూసి కొన్ని నేర్చుకుంటున్నాం అన్నారు. మోదీ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియాను ఇండియాలోనూ బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతుంది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిర్వహించిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక నేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ ప్రపంచంలో చిన్నారుల భద్రత అత్యంత కీలకమని, సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను రక్షించేందుకు ఆస్ట్రేలియా తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగానిలుస్తుందని, భారత్ కూడా ఈ విషయంలో ఆస్ట్రేలియా నుంచి పాఠాలు నేర్చుకుంటోందని చెప్పారు.
పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికల దుష్ర్పభావాల గురించిన ఆందోళనలు, ప్రపంచ వ్యాప్తంగా మైనర్లపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే పిలుపులను మరింత బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా చట్టం తీసుకొచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ చట్టం అమలుతో ప్రధాన సోషల్ మీడియా వేదికలు వయోపరిమితిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే బాటలో పయనించేందుకు పలు దేశాలు సమాయత్తం అవుతున్నాయి.
భారతదేశంలోనూ ఆస్ట్రేలియా తరహాలో మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా బ్యాన్ విధించాలనే డిమాండ్ తరచూ వినిపిస్తోంది. భారత ప్రభుత్వంసైతం ఆమేరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు (వాట్సాప్‌కి యూజర్ నేమ్ ఫీచర్ మీద నోటీసులు, ఇన్‌స్టాగ్రామ్‌కి చైల్డ్ పోర్నోగ్రఫీ మీద నోటీసులు, టెలిగ్రామ్ ఈ మధ్య బ్యాన్, సిగ్నల్‌కి నోటీసులు) అందుకు బలం చేకూర్చుతున్నాయి.
భారత దేశంలోని పలు రాష్ట్రాల ఆస్ట్రేలియా తరహాలో పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా బ్యాన్ విధించేందుకు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధించేందుకు చర్యలు ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే తరహా చర్యలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొద్దిరోజుల క్రితం ఇదే విషయంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా తరహాలో ఏపీలోనూ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
