Biological-E Corbevax : బయో-ఈ కొవిడ్ వ్యాక్సిన్.. ధర రూ.150 ఉండొచ్చు!
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదు ధర రూ.150 ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది.
- Sreehari A
- Published On : June 10, 2021 / 03:46 PM IST
Biological E Covid Vaccine May Cost Rs 150 Per Dose, Says Govt Sources
Biological-E Covid vaccine : హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదు ధర రూ.150 వరకు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది. అలాగే బయోలాజికల్-ఈ తయారీదారు కూడా 30 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రిజర్వ్ చేయనుంది. ఇదివరకే 30 కోట్ల మోతాదులను ముందస్తుగా కేంద్రం బుక్ చేసింది.
ఒక మోతాదుకు రూ. 50 చొప్పున మొత్తం రూ. 1,500 కోట్లు అడ్వాన్స్ చెల్లించినట్టు సమాచారం. అత్యవసర వినియోగానికి ఈయూఏ ఆమోదం పొందిన తర్వాత భారత మార్కెట్లో రాబోయే అత్యంత చౌకైన వ్యాక్సిన్ ఇదే కానుంది.
బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ మూడవ దశ ట్రయల్స్‌లో ఉంది. ఫేజ్ I & II ట్రయల్స్ మంచి ఫలితాలు వచ్చాయి. టీకాకు జూలై-ఆగస్టు నాటికి EUA ఆమోదం లభిస్తే.. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ధరను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.
