Assam-West Bengal CM: బెంగాల్, అస్సాం సీఎం ఎవరు? బీజేపీ అధిష్టానం కసరత్తు

BJP Assam - West Bengal CM: ఈ నెల 9న బెంగాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

  • Updated on- May 5, 2026 / 05:33 PM IST

BJP Focus on West Bengal Assam CM

Assam-West Bengal CM: బెంగాల్, అస్సాంలో సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెండు రాష్ట్రాలకు ఇంచార్జ్ లను నియమించింది. బెంగాల్ బీజేపీ పరిశీలకుడిగా అమిత్ షా, సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించారు. అస్సాం పరిశీలకుడిగా జేపీ నడ్డా, సహ పరిశీలకుడిగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనిని నియమించారు. ముఖ్యమంత్రి ఎంపికపై ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలలో పరిశీలకులు చర్చించి ఒకరిని ఎంపిక చేయబోతున్నారు. ఈ నెల 9న బెంగాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అటు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి సహా పార్టీ ప్రధాన నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. వీలైనంత త్వరగా చర్చలు జరిపి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు.

Also Read: నాడు పని మనిషి.. నేడు ఎమ్మెల్యే.. ఏకంగా 12వేల మెజార్టీ.. ఎవరీ కలితా మాఝీ.. ఎమ్మెల్యే సీటు ఎలా దక్కింది..

వెస్ట్ బెంగాల్ లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార తేదీని ఖరారు చేసింది. 9వ తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే కాబోయే సీఎం ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి అబ్జర్వర్లనున నియమించింది బీజేపీ హైకమాండ్. బెంగాల్ లో మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుని సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.

అటు అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ అక్కడ ఎవరిని సీఎం చేయాలి అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే మూడోసారి కూడా కొనసాగించాలా లేదంటే కొత్త వారికి అవకాశం కల్పించాలా? అనేదానిపై బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే దాదాపు సువేందు అధికారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. సువేందు అధికారితో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Also Read: విజయ్ కీలక నిర్ణయం.. ఆ పార్టీలతో కలవం.. పొత్తులపై క్లారిటీ.. కలిసొచ్చే పార్టీలివే..