BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
- Subhan Ali Shaik
- Published On : July 2, 2022 / 07:22 AM IST
Pm Modi (1)
BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం మొదలవుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 3గంటల సమయానికి బేగంపేట చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో 3గంటల 20నిమిషాల కల్లా హైటెక్స్ ప్రాంగణానికి చేరుకోనున్నారు. 3గంటల 30నిమిషాలకు నోవాటేల్ కన్వేషన్ సెంటర్ కి విచ్చేస్తారు.
ప్రధాని రాకతో జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు , మరుసటి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3.30 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.
Read Also : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
శుక్రవారం రాత్రే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కార్యవర్గ సమావేశాల అజెండాను నిర్ణయించారు.
