Schoolchildren wish them happy married life
Viral Video: ఏ కల్మషమూలేనివారు పిల్లలు. మనం బయటకు వెళ్తున్న సమయంలో అటువంటి వారు ఎదురుపడితే మన ముఖంలో చిరునవ్వు వెలుగుతుంది. మనం పుట్టినరోజు వంటి వేడుకలు జరుపుకుంటే పిల్లలు శుభాకాంక్షలు చెబితే ఎంతగానో మురిసిపోతాం.
అటువంటిది దాదాపు 100 మంది పిల్లలు ఊహించని విధంగా నవ వధూవరులకు “హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అంటూ అరుస్తూ శుభాకాంక్షలు చెబుతూ వెళ్తే ఎలా ఉంటుంది.
పెళ్లి తర్వాత రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ పెళ్లి పందిరి వద్దకు వెళ్తున్న వధూవరులకు.. రోడ్డుపై స్కూలు బస్సుల్లో వెళ్తున్న చిన్నారులు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆ వధూవరులు మురిసిపోయారు.
ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఊహించని విధంగా చిన్నారులు శుభాకాంక్షలు చెబుతుండగా తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఒక్కోసారి దేవుడు ఇలా చిన్నపిల్లల గొంతుతో ఆశీస్సులు తెలుపుతాడంటూ హిమా.జి అనే మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇటువంటి శుభాకాంక్షలు రావడం చాలా అరుదు అని కొందరు కామెంట్లు చేశారు.