×
Ad

పెళ్లి చేసుకుని భర్తతో ఇంటికి వెళ్తున్న అమ్మాయి.. తుపాకీతో గురిపెట్టి ఆమెను ఎత్తుకెళ్లిన మాజీ ప్రియుడు

పెళ్లికూతురిని ఆమె మాజీ ప్రియుడు తీసుకెళ్తుంటే వరుడు, ఇతర కుటుంబ సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

  • ఒడిశాలోని బడాబంధ, తార్భా రోడ్‌లో ఘటన
  • పెళ్లివారి వాహనాన్ని అడ్డగించిన యువకుడు
  • అతడు ఎత్తుకెళ్లిన వధువును రక్షించే పనిలో పోలీసులు

Odisha: ఓ యువకుడితో ఇవాళ ఉదయం ఓ అమ్మాయికి పెళ్లి జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆ కొత్త పెళ్లికూతురు ఇంటికి వెళుతోంది. ఇంతలో ఆమె మాజీ ప్రియుడు మరో ఇద్దరు యువకులతో కలిసి వచ్చాడు. పెళ్లికొడుకు తలకు గన్‌ పెట్టి బెదిరించి వధువును ఎత్తుకెళ్లాడు.

ఈ ఘటన ఒడిశాలోని బడాబంధ, తార్భా రోడ్‌లో చోటుచేసుకుంది. వరుడి పేరు హరిబంధు పటేల్. అతడు బోలంగీర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. పెళ్లి కోసం అతడు కంతమాల్‌కు వెళ్లాడు. పెళ్లి తంతు ముగిశాక పెళ్లికొడుకు, పెళ్లికూతురు కుటుంబ సభ్యులతో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వారి వాహనాన్ని వధువు మాజీ ప్రియుడు అడ్డుకున్నాడు.

Also Read:  T20 World Cup 2026: శ్రీలంకపై ఇంగ్లాండ్‌ ఘన విజయం

నిందితుడికి మరో ఇద్దరు యువకులు సాయం చేశారు. పెళ్లికొడుకుకు గన్‌ చూపించి బెదిరించారు. దీంతో పెళ్లికూతురిని ఆమె మాజీ ప్రియుడు తీసుకెళ్తుంటే వరుడు, ఇతర కుటుంబ సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

వధువుని ఆమె మాజీ ప్రియుడు ఎత్తుకెళ్లాక వరుడు తర్భా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన తలకు తుపాకీని గురిపెట్టి తన భార్యను కిడ్నాప్ చేశారని చెప్పాడు. వధువును రక్షించేందుకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.