Marriage Asset Demand : పెళ్లి కావాలా నాయనా.. అమ్మాయి పేరు మీద ఓ రూ.2, 3 కోట్లు ఆస్తులు రిజిస్టర్ చేస్తావా?

Bride Family Demands : పెండ్లి సంబంధాల విషయంలో ఆస్తులు, ఆదాయం, ఉద్యోగం వంటి అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది.

Arranged Marriage Bride Family Demands

Marriage Asset Demand : పెళ్లి సంబంధం అంటే సాధారణంగా ముందుగా చూసేది ఏంటి? ఉద్యోగం, జీతం, కుటుంబం. కానీ, ఇప్పుడు ఆస్తుల విలువ కూడా కీలకంగా మారుతోంది.? మంచి జీతంతో కూడిన ఉద్యోగం మాత్రమే ఉంటే చాలదు.. అబ్బాయి బుద్దిమంతుడై ఉంటే చాలదు.. అతని కుటుంబానికి భారీ స్థాయిలో ఆస్తులు కూడా ఉండాల్సిందే.. అలాంటి వ్యక్తులను పెండ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది యువతులు ఇష్టపడుతున్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ పోస్టు చేసిన ఓ రెడిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టులో చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి.

Also Read : Srisailam Elevated Corridor: శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌లో మార్పులు.. 2 లేన్లు కాదు 4 లేన్లుగా.. కేంద్రం కీలక నిర్ణయం

పెండ్లి సంబంధాల విషయంలో ఆస్తులు, ఆదాయం, ఉద్యోగం వంటి అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. తాజాగా రెడిట్‌లో వెలువడిన ఓ పోస్ట్‌లో.. కొందరు వధువు కుటుంబాలు వరుడికి రూ.2 లేదంటే రూ.3 కోట్ల విలువైన ఆస్తులు ఉండాలని కోరుతున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని పెళ్లి సంబంధాల విషయంలో వరుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆస్తుల విలువ, ఉద్యోగం, ఆదాయం వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారని పోస్టు చేసిన వ్యక్తి పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ మొత్తంలో ఆస్తులు ఉన్న వరుడి కోసం కొన్ని కుటుంబాలు చూస్తున్నాయనే వాదనను పోస్టులో ప్రస్తావించారు.

తాజా పోస్టుపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించిన నిర్ణయమని, ఆర్థిక స్థితిని మాత్రమే ప్రాతిపదికగా చేసుకోవడం సరైనది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, వివాహ సంబంధాల్లో ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం సహజమేనని మరికొందరు అంటున్నారు. అయితే, ఈ విషయాలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అన్ని వధువు కుటుంబాలు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నాయని నిర్ధారించే ఆధారాలు లేవు. అందువల్ల ఈ వైరల్ పోస్ట్‌ను విస్తృత సమాజానికి వర్తించే వాస్తవంగా చూడకూడదని పేర్కొన్నాడు.

అయితే, ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో.. ఆధునిక వివాహ సంబంధాల్లో ఆర్థిక స్థితి, ఆస్తులు, ఆదాయానికి పెరుగుతున్న ప్రాధాన్యంపై మరోసారి చర్చ జరుగుతోంది.