Udhampur Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 15మంది మృతి.. 20మందికిపైగా గాయాలు..
Udhampur Bus Accident : జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 15 మంది ప్రయాణికులు మృతిచెందారు.
- Harishth Thanniru
- Published on- April 20, 2026 / 12:24 PM IST
Udhampur Bus Accident
- జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం
- లోయలో పడిపోయిన బస్సు
- 15మంది ప్రయాణికులు మృతి
Udhampur Bus Accident : ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15మంది చనిపోయరు. 20మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన జమ్మూకాశ్మీర్‌లోని రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న మార్గంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read : Telangana Government : MMTS ఉచిత రైలు ప్రయాణం.. సోషల్ మీడియాలో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ..
రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ కు వెళ్తుండగా సోమవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారులకు అందుబాటులో ఉంటానని, ఏమైనా అత్యవసరం అయితే స్పందించాలని జితేంద్ర సింగ్ వెల్లడించారు.
బస్సు ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. ఉధంపూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకం. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
#WATCH | Udhampur, Jammu and Kashmir: A bus met with an accident in the village Kanote, Udhampur.
10 people have died, and a rescue operation is underway. The injured have been shifted to the government hospital in Udhampur: J&K Police pic.twitter.com/iqEcoxg2F6
— ANI (@ANI) April 20, 2026
