బస్సుల్లో మహిళల రక్షణ కోసం 6వేల మంది పోలీసులు

  • Publish Date - September 28, 2019 / 07:38 AM IST

మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీపావళి పండుగ లోపే ఈ ప్రక్రియను అమలు చేస్తామని తెలిపారు. మూడేళ్ల పాటు హోంగార్డులుగా పనిచేసిన వారికి మార్షల్స్ గా నియామకాల్లో మొదటి ప్రాధాన్యతన నిస్తామన్నారు. 

బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంరక్షణ బాధ్యత మార్షల్స్ దేనని..కాగా  త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో పయనించే బస్సుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మార్షల్స్ విధులు నిర్వహించనున్నారు. ఈ అంశంపై హోంమంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ..ప్రభుత్వం లెక్కల ప్రకారం 5 వేల 500ల మంది హోంగార్డులు రిటైర్ అయ్యారనీ..దీంతో ఈ స్థానాన్ని భర్తీ చేస్తూ..వారిని మహిళల రక్షణ కోసం వినియోగించనున్నామని తెలిపారు.