తెల్ల టీషర్టులతో నిరసన.. ప్రియాంకా గాంధీ, ఇతరుల టీ షర్టులపై రాసిన మింటా దేవి ఎవరు? ఆ ఫొటో ఎందుకు వేశారు?

గణాంకాల ప్రకారం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలి వయసు 115 ఏళ్లు. బిహార్‌లో ఓటరు జాబితాలో ఉన్న వృద్ధురాలి వయసేమో 124 ఏళ్లు. దీంతో ఓటరు జాబితా అంతా మోసమని స్పష్టమవుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

తెల్ల టీషర్టులతో నిరసన.. ప్రియాంకా గాంధీ, ఇతరుల టీ షర్టులపై రాసిన మింటా దేవి ఎవరు? ఆ ఫొటో ఎందుకు వేశారు?

Minta Devi Protest Sonia - Priyanka

Updated On : August 12, 2025 / 6:45 PM IST

కాంగ్రెస్ అగ్ర నాయకురాళ్లు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ నేతృత్వంలో ఇండియా బ్లాక్ మంగళవారం పార్లమెంట్ వెలుపల ‘మింతా దేవి’ అని ముద్రించిన తెలుపు టీ షర్ట్‌లు వేసుకుని నిరసన మార్చ్ నిర్వహించింది. ఈ నినాదం బిహార్‌లో ఓటరు మోసానికి సంబంధించినదని ఇండియా బ్లాక్ చెబుతోంది.

మింతా దేవి పేరుతో 124 సంవత్సరాల వయసు ఉన్న ఓ కురువృద్ధురాలు ఓటరు జాబితాలో ఉన్నారని ఆరోపణ. ఆ నకిలీ ఓటరు చిత్రాన్ని ముద్రించిన టీ షర్టులతో ఇవాళ ఇండియా బ్లాక్ నిరసన మార్చ్ నిర్వహించింది.

గణాంకాల ప్రకారం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలి వయసు 115 ఏళ్లు. బిహార్‌లో ఓటరు జాబితాలో ఉన్న వృద్ధురాలి వయసేమో 124 ఏళ్లు. దీంతో ఓటరు జాబితా అంతా మోసమని స్పష్టమవుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

Also Read: వర్షాలు బాబోయ్ వర్షాలు.. హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

బిహార్‌లో ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (SIR)లో ఈ రకమైన లోపాలు జరిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించిందని, దానిని ‘ఓటరు మోసం’గా అభివర్ణిస్తూ ప్రతిపక్ష నాయకులు నిర్వహించిన నిరసనలో భాగంగా ఈ ప్రదర్శన జరిగింది.

ఇదే విషయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు నిన్న నిరసనల్లో పాల్గొని అరెస్టు అయిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కోసం తాము నిరసన చేస్తున్నామని, స్పష్టమై ఓటరు జాబితా కావాలని డిమాండ్ చేశారు.

తన పార్టీ చేసిన పరిశోధనలో కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు బయటపడిందని అన్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం మౌనంగా ఉందని చెప్పారు.