వర్షాలు బాబోయ్ వర్షాలు.. హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది.

Rain
తెలంగాణలో కురిసిన వర్షాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 13 నుంచి 14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ ఒకట్రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ కలెక్టర్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.
అలాగే, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.