FASTag Annual Pass : ఆగస్టు 15 నుంచే ‘వార్షిక ఫాస్ట్ ట్యాగ్’ అమల్లోకి.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కి వర్కవుతుందా?
FASTag Annual Pass : ఆగస్టు 15 నుంచి నేషనల్ హైవే వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి వస్తోంది. ఈ వార్షిక పాస్ హైదరాబాద్ ORR రోడ్డుపై వర్తిస్తుందా?

FASTag Annual Pass
FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 15 నుంచే కొత్త వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్ పేరుతో (FASTag Annual Pass) ప్రవేశపెట్టబోతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు ఈ వార్షిక పాస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ కోసం ఒకేసారి రూ. 3వేలు చెల్లించి ఏడాదికి 200 టోల్ ట్రిప్స్ చేయొచ్చు.
ఈ ప్రత్యేక పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అందులోనూ నేషనల్ హైవేలపై వెళ్లే వాహనాలకు మాత్రమే ఈ వార్షిక పాస్ వర్తిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీకి చెందిన ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై కూడా ఈ వార్షిక పాస్ వర్తిస్తుందా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషించి తెలుసుకుందాం..
ORR భౌగోళిక పరిమితి, నిర్వహణ :
హైదరాబాద్ నగర ORR అనేది HMDA (హైదరాబాద్ మెట్రోపొలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అంటే.. ఇది స్టేట్ లెవల్ ఎక్స్‌ప్రెస్‌వే మాత్రమే.. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ ORRకు సంబంధించి ప్రైవేట్ పార్టనర్ IRB గోల్కోండ ఎక్స్ ప్రెస్‌వే పి.వి.టీ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
ఈ రోడ్ దాదాపు 158 కిలోమీటర్ల పొడవుగా హైదరాబాద్ చుట్టూ కలిపే అనేక జాతీయ రహదారులను అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు.. NH-44, NH-65, NH-161, NH-163 మొదలైన జాతీయ రహదారులు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూనే ఉన్నాయి.
అయితే, ఈ ORR పూర్తిగా NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) లేదా MoRTH (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ హైవేస్) పరిధిలోకి రాదని గమనించాలి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రాష్ట్ర మౌలిక వేదికగా ఏర్పాటైంది. ఈ రోడ్డుపై టోల్ వసూళ్లు సైతం రాష్ట్ర మౌలిక పరిపాలన ప్రకారమే జరుగుతాయి.
నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్ రేంజ్ ఏంటి? :
నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది NHAI ఆధ్వర్యంలోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకే మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ వాహనదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. టోల్ వసూళ్లలో పారదర్శకతతో పాటు టోల్ గేట్‌ల వద్ద ట్రాఫిక్ తగ్గించడమే దీని ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ వార్షిక పాస్ జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్లకు మాత్రమే పరిమితం. ఈ పాస్‌ను వాడాలంటే మీరు ప్రయాణించే హైవే NHAI పరిధిలో ఉండాలి.
హైదరాబాద్ ORRపై ఎందుకు వర్తించదంటే? :
హైదరాబాద్ ORR స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చెందింది. నేషనల్ హైవే కింద కాదు. మరొక ముఖ్య కారణం ఏమిటంటే.. ORRపై ఉన్న టోల్ గేట్లు IRB ప్రైవేట్ ఎంటిటీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాస్‌లు, డిస్కౌంట్లపై యాజమాన్య విధానాల ప్రకారమే టోల్ వసూలు చేస్తుంది.
Read Also : Movie Ticket Prices : వార్ 2, కూలీ మూవీ టికెట్ రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
అందుకే, నేషనల్ ఫాస్టాగ్ వార్షిక పాస్ ORRపై ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. మీరు ORRపై ప్రయాణించాలంటే.. ప్రత్యేకంగా టోల్ చెల్లించాల్సిందే. లేకపోతే HMDA నుంచి అందించే ORR-స్పెసిఫిక్ నెలవారీ పాస్‌లు తీసుకోండి.
ORRపై ప్రయాణించే వారికి సూచనలివే :
- మీరు ప్రతిరోజూ ORRపై ప్రయాణిస్తే.. HMDA అందించే నెలవారీ పాస్‌లు తీసుకోవడం మంచిది.
- ట్రిప్ క్యాలిక్యులేషన్ కిలోమీటర్ల ఆధారంగా ఉంటుంది.
- ఉదాహరణకు.. మీ కారుకు రూ.2.44/కి.మీ చొప్పున చార్జ్ చేస్తారు.
- FASTag తప్పనిసరి అయినా నేషనల్ వార్షిక పాస్ ORRపై పని చేయదు.
మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఫాస్టాగ్ సౌకర్యం పూర్తిగా అమలులో ఉంది. కానీ, NHAI వార్షిక ఫాస్టాగ్ పాస్ ORRపై వర్తించదు. ORR నేషనల్ హైవే కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ ORR ప్రైవేట్ కాంట్రాక్టరుతో HMDA ఆధ్వర్యంలో పనిచేస్తోంది. అందువల్ల, ORRపై ప్రయాణాలు చేసేటప్పుడు సాధారణ టోల్ పేమెంట్లు లేదా రాష్ట్ర లెవల్ నెలవారీ పాస్‌లు తప్ప వేరే మరో మార్గం లేదని గమనించాలి.
హైదరాబాద్ ORR టోల్ పాస్ అప్లికేషన్ ప్రాసెస్ :
- అధికారిక వెబ్‌సైట్ : https://orrhyderabad.in విజిట్ చేయండి.
- ఈ వెబ్‌సైట్ ద్వారా మీ వాహనానికి నెలవారీ పాస్ తీసుకోవచ్చు.
- టోల్ చార్జీలు తెలుసుకోవచ్చు.
- ఫాస్టాగ్ సమస్యలపై ఫిర్యాదులు చేయొచ్చు.
- ప్రయాణ రికార్డులు, రసీదు, లెక్కలు పొందొచ్చు.
- ORR HMDA పాస్‌లు నేషనల్ పాస్‌లకు సంబంధం ఉండదు.
- ప్రతి వాహనానికి పాస్ అప్లై చేసి ఉండాలి.
- మీ వాహనంపై FASTag తప్పనిసరిగా యాక్టివ్ అయి ఉండాలి.
- దరఖాస్తు సమయంలో ఫోన్ నంబర్ ఫాస్టాగ్ అకౌంట్-లింక్‌డ్ అయి ఉండొచ్చు.